Viral Video: శ్రావణ సోమవారం నాడు దారుణం.. మహిళను కింద పడేసి కాళ్లతో ఘోరంగా తొక్కిన ఎద్దు! వీడియో వైరల్

వీధిలో నడుచుకుంటూ వెళ్తున్న ఓ మహిళపై అదే వీధిలో తిరుగుతున్న ఎద్దు ఒకటి దాడి చేసి తీవ్రంగా గాయపరిచింది. అడ్డుకోబోయిన వారిని సైతం కుమ్మేసింది. దీంతో ఒకే కుటుంబంలో ముగ్గురు తీవ్రంగా గాయపడ్డారు. ఇందుకు సంబంధించిన వీడియో ఒకటి ప్రస్తుతం నెట్టింట వైరల్‌గా మారింది. మాధవ్ నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని రాబర్ట్ లైన్ ప్రాంతంలో ఈ సంఘటన సోమవారం (జులై28) జరిగింది..

Viral Video: శ్రావణ సోమవారం నాడు దారుణం.. మహిళను కింద పడేసి కాళ్లతో ఘోరంగా తొక్కిన ఎద్దు! వీడియో వైరల్
Stray Bull Attack

Updated on: Jul 28, 2025 | 5:06 PM

కట్ని, జులై 28: కొందరు మొక్కుల పేరిట ఆవులను, ఎద్దులను, మేకలను వీధుల్లో వదిలేయడం చూస్తూనే ఉంటాం. అయితే మొక్కు సంగతి దేవుడెరుగు.. అవి మాత్రం విచ్చల విడిగా వీధుల్లో సంచరిస్తూ వ్యాపారులు, పిల్లలపై దాడి చేయడం పరిపాటై పోయింది. తాజాగా ఓ ప్రాంతంలో వీధుల్లో తిరుగుతున్న ఎద్దు ఒకటి జనాలపై దాడులకు తెగబడుతోంది. కంటికి కనిపించిన వారిపై విచక్షణా రహితంగా దాడి చేసి గాయపరుస్తుంది. ఈ రోజు ఉదయం వీధిలో నడుచుకుంటూ వెళ్తున్న ఓ మహిళపై దాడి చేసి తీవ్రంగా గాయపరిచింది. అడ్డుకోబోయిన వారిని సైతం కుమ్మేసింది. దీంతో ఒకే కుటుంబంలో ముగ్గురు తీవ్రంగా గాయపడ్డారు. ఇందుకు సంబంధించిన వీడియో ఒకటి ప్రస్తుతం నెట్టింట వైరల్‌గా మారింది. మాధవ్ నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని రాబర్ట్ లైన్ ప్రాంతంలో ఈ సంఘటన సోమవారం (జులై28) జరిగింది. వివరాల్లోకెళ్తే..

మధ్యప్రదేశ్‌లోని కట్ని నగరంలో సోమవారం ఓ ఎద్దు హల్‌చల్ చేసింది. శ్రావణ మాసం కావడంతో సోమవారం ఉదయాన్నే పలువురు దేవాలయాలకు వెళ్లేందుకు బయటకు వచ్చారు. అదే సమయంలో వీధిలో ఉన్న ఎద్దు ఒకటి.. ఓ మహిళ తన ఇంటి బయట నిలబడి ఉండగా అకస్మాత్తుగా ఆమెపై దాడి చేసింది. ఆమెను కింద పడేసి కాళ్లతో తొక్కసాగింది. ఆమె అరుపులు విని ఆమె కూతురు సహాయం చేసేందుకు బయటకు పరుగెత్తింది. కానీ ఎద్దు ఆమెను కూడా వెంబడించి పడేసింది. కొద్దిసేపటికే మరొక కుటుంబ సభ్యుడు బయటకు వచ్చాడు. సదరు ఎద్దు అతనిపై కూడా దాడి జరిగింది. ఈ దాడిలో ఒకే కుంటంబంలోని ముగ్గురూ గాయపడ్డారు. ఈ సంఘటన మొత్తం సమీపంలోని CCTV ఫుటేజ్‌లో రికార్డైంది. ప్రస్తుతం ఈ వీడియో క్లిప్‌ సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.

ఇవి కూడా చదవండి

ఇరుగు పొరుగు గుమికూడి ఎద్దును తరమడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు. కానీ వీధుల్లో తిరిగే ఎద్దులను మున్సిపల్ కార్పొరేషన్ పట్టుకుపోవాలని, విచ్చలవిడిగా సంచరిస్తున్న జంతువులను నియంత్రించాలని కాట్ని కలెక్టర్‌కు స్థానికులు ఫిర్యాదు చేశారు. ఇప్పటికే ఇందుకు సంబంధించిన కఠినమైన ఆదేశాలు జారీ చేసినప్పటికీ ఎద్దులు, ఇతర పశువులు నగరంలో స్వేచ్ఛగా తిరుగుతూనే ఉన్నాయి. ఎద్దుల దాటికి భయపడి వాటిని ‘మృత్యు ఏజెంట్లు’ అని పిలవడం ప్రారంభించారు. మరికొందరేమో శ్రావణ మాసంలో ఏదో అపచారం జరిగి ఉంటుంది అందుకే నందీశ్వరుడికి కోపం వచ్చిందంటూ వేదంతం చెబుతున్నారు. కానీ వీటి వల్ల ప్రజల ప్రాణాలకు ముప్పు వాటిల్లుతోందని, వీధి జంతువులను పట్టుకోవడంలో మున్సిపల్ టాస్క్ ఫోర్స్ పూర్తిగా విఫలైనట్లు స్థానికులు ఆరోపిస్తున్నారు. ఈ సంఘటనపై స్పందించిన కట్ని కలెక్టర్ విచ్చలవిడి జంతువులను వీధుల్లో వదులుతున్న యజమానులపై ఎఫ్ఐఆర్‌లు నమోదు చేయాలని ఆదేశించారు. ఇప్పటికే ఆ జిల్లాలోని వివిధ పోలీస్ స్టేషన్‌లలో ఇలాంటి అనేక కేసులు నమోదైనట్లు సమాచారం.

మరిన్ని జాతీయ వార్తల కోసం క్లిక్‌ చేయండి.