
Strain virus: కరోనా కొత్త వైరస్ మరింత భయాందోళనకు గురి చేస్తోంది. ముందే కరోనాతో ఇబ్బందులు పడుతున్న నేపథ్యంలో ఈ కొత్త వైరస్ మరింత ఆందోళనకు గురి చేస్తోంది. బ్రిటన్ నుంచి పాకిన ఈ స్ట్రైయిన్ వైరస్ భారత్‌లోనూ పాకింది. ఈ కొత్త వైరస్ నేపథ్యంలో విదేశాల నుంచి భారత్‌కు వచ్చిన వారిని క్వారంటైన్ చేస్తూ పరీక్షలు జరుపుతున్నారు. ముంబాయి అంతర్జాతీయ విమానాశ్రయానికి మంగళవారం 664 మంది ప్రయాణికులు రాగా, వీరిలో 361 మంది ప్రయాణికులను క్వారంటైన్‌లో ఉంచినట్లు పౌర విమానయాన అధికారులు తెలిపారు.
అయితే వీరి నుంచి రక్త నమూనాలు సేకరించి పరీక్షలు జరుపుతున్నట్లు అధికారులు వెల్లడించారు. వీరికేమైనా కొత్త వైరస్ సోకిందా అనే దానిపై పరిశీలిస్తున్నారు. మొత్తం 9 అంతర్జాతీయ విమానాలు ముంబాయిలో ల్యాండ్ కాగా, ఆ విమానాల్లో వచ్చిన వారిని పరిశీలించి 254 మంది ఇతర రాష్ట్రాలకు వెళ్లేందుకు అనుమతి ఇచ్చారు అధికారులు.
ఇక గర్భిణులు, వృద్ధులకు క్వారంటైన్ విధించలేదు. స్ట్రైయిన్ వైరస్ నేపథ్యంలో ఇతర దేశాల నుంచి వచ్చే ప్రయాణికుల కోసం కొత్త ప్రొటోకాల్‌ను తీసుకువచ్చింది దేశ పౌర విమానయాన శాఖ. విదేశాల నుంచి వచ్చే ప్రయాణికులు తప్పనిసరిగా ఏడు రోజుల పాటు సాధారణ క్వారంటైన్, మరో ఏడు రోజులు గృహ నిర్బంధంలో ఉండాల్సి ఉంటుంది.
Strain virus: యూకే స్ట్రైయిన్ వైరస్‌కు భయపడాల్సిన అవసరం లేదు: తెలంగాణ ప్రజారోగ్య సంచాలకులు