మద్రాస్ హైకోర్టు వ్యాఖ్యలపై ఎన్నికల కమిషన్ కలవరం, మీడియాను నియంత్రించాలని విన్నపం,

| Edited By: Anil kumar poka

Apr 30, 2021 | 1:08 PM

మౌఖికంగా కోర్టు చేసే వ్యాఖ్యలపై మీడియా  రిపోర్టు చేయకుండా దాన్ని నియంత్రించాలని ఎన్నికల కమిషన్ మద్రాహ్ హైకోర్టును కోరింది. బెంగాల్ వంటి రాష్ట్రాల్లో రాజకీయ ర్యాలీలను....

మద్రాస్  హైకోర్టు వ్యాఖ్యలపై ఎన్నికల కమిషన్  కలవరం, మీడియాను నియంత్రించాలని విన్నపం,
Stop Media Reporting Of Oral Observations Says Ec To Madras Highcourt
Follow us on

మౌఖికంగా కోర్టు చేసే వ్యాఖ్యలపై మీడియా  రిపోర్టు చేయకుండా దాన్ని నియంత్రించాలని ఎన్నికల కమిషన్ మద్రాహ్ హైకోర్టును కోరింది. బెంగాల్ వంటి రాష్ట్రాల్లో రాజకీయ ర్యాలీలను ఆపాలని, మీరు ఈ ర్యాలీలను అనుమతించిన కారణంగానే కోవిడ్ కేసులు పెరిగిపోతున్నాయని మద్రాస్ హైకోర్టు ఇటీవల ఈసీని విమర్శించింది. ఇందుకు మీరే పూర్తిగా బాధ్యత వహించాలని, మీపై  హత్యాభియోగాలు ఎందుకు మోపరాదని కూడా వ్యాఖ్యానించింది. దీనిపై స్పందించిన ఈసీ..ఎన్నికలు జరుగుతున్న రాష్ట్రాల్లో పార్టీల ప్రచారం వల్లే కోవిడ్ కేసులు పెరిగాయనడం సరి కాదని, ఎలెక్షన్స్ జరగని రాష్ట్రాల్లో కూడా కేసులు పెరగడం లేదా అని తన పిటిషన్ లో ప్రశ్నించింది.కోర్టు మౌఖికంగా (ఓరల్ గా ) చేసిన వ్యాఖ్యలపై మీడియాలో వచ్చిన వార్తలు ఆందోళన కలిగించేవిగా ఉన్నాయని, అందువల్ల మొదట మీడియాను అదుపు చేయాలనీ ఈ సంస్థ కోరింది. రాజ్యాంగ సంస్థ అయిన తమను ఈ వార్తలు  ఎంతో బాధించాయని,  ఎన్నికల నిర్వహణకు సంబంధించి  వీటిపై  తమకు రాజ్యాంగ బాధ్యతలు ఉన్నాయని  కమిషన్ వర్గాలు పేర్కొన్నాయి.బెంగాల్ లో ఓ పత్రికలో వచ్చిన వార్తను పురస్కరించుకుని ఓ మర్డర్ కి డిప్యూటీ ఎలెక్షన్ కమిషనర్ బాధ్యుడంటూ ఆయనపై పోలీసు కంప్లయింట్ దాఖలయిందని, ఇదెక్కడి విడ్డూరమని కూడా ఈసీ ప్రశ్నించింది.

రికార్డుల్లో కెక్కని కోర్టు వ్యాఖ్యలను ప్రచురించడానికి లేదా సర్క్యులేట్ చేయడానికి ఎవరినీ అనుమతించే ప్రసక్తి లేదని, తమిళనాడులో ఏప్రిల్ 4 నే ప్రచారం ముగీసినందున న్యాయస్థానం ఈ విధమైన కామెంట్స్ చేయడం సముచితం కాదని ఈసీ అసంతృప్తిని వ్యక్తం చేసింది. మే 2 న ఓట్ల లెక్కింపు నేపథ్యంలో కోవిడ్ సంబంధ చర్యలను ఈసీ తీసుకుందని కలకత్తా, కేరళ హైకోర్టులు కూడా సంతృప్తిని వ్యక్తం  చేశాయని ఈ సంస్థ తన పిటిషన్ లో వెల్లడించింది. పైగాఈ 5 రాష్టాలకు ఎన్నికల ప్రకటనను ఫిబ్రవరి 26 న చేశామని, అప్పటికి దేశంలో కోవిడ్ కేసులు పెద్దగా లేవని తెలిపింది. కేసులు ఎక్కువగా ఉన్న రాష్ట్రాల్లో ఎన్నికలు లేవని, ఇందుకు ఉదాహరణగా మహారాష్ట్ర, ఢిల్లీ, కర్ణాటక రాష్ట్రాలను ఈసీ ప్రస్తావించింది.