Follow Covid Norms:కరోనా తగ్గిందని ఆలయాలకు వెళ్తున్నారా.. ప్లీజ్ ఇలా చెయ్యకండి..

| Edited By: Ravi Kiran

Jul 27, 2021 | 12:10 PM

ఉజ్జయిని లోని మహాకాళేశ్వర్ శివ ఆలయం వద్ద మంగళవారం ఉదయం జరిగిన తొక్కిసలాటలో అనేకమంది మహిళలు, పిల్లలు గాయపడ్డారు.మధ్యప్రదేశ్ సీఎం శివరాజ్ సింగ్ చౌహాన్, బీజేపీ నేత ఉమా భారతి వంటి వీఐపీలు తమ కుటుంబాలతో...

Follow Covid Norms:కరోనా తగ్గిందని ఆలయాలకు వెళ్తున్నారా.. ప్లీజ్ ఇలా చెయ్యకండి..
Stampede At Ujjaini Mahakaleswar Templein Bhopal
Follow us on

ఉజ్జయిని లోని మహాకాళేశ్వర్ శివ ఆలయం వద్ద మంగళవారం ఉదయం జరిగిన తొక్కిసలాటలో అనేకమంది మహిళలు, పిల్లలు గాయపడ్డారు.మధ్యప్రదేశ్ సీఎం శివరాజ్ సింగ్ చౌహాన్, బీజేపీ నేత ఉమా భారతి వంటి వీఐపీలు తమ కుటుంబాలతో సహా రావడంతో పరిస్థితి మరింత ఉద్రిక్తమైంది. పెద్ద సంఖ్యలో ఉన్న భక్తులు ఒకరికొకరు తీసుకుంటూ ఆలయం లోకి ప్రవేశించేందుకు చొచ్చుకు వచ్చేందుకు ప్రయత్నించారు. వారిని పోలీసులు కూడా అదుపు చేయలేకపోయారు. మొదట భక్తుల సంఖ్య తక్కువగానే ఉన్నా ఆ తరువాత అనూహ్యంగా పెరిగిపోయింది. ఒక దశలో వీరు తమలో తాము దాడులకు పాల్పడడమే గాక, పోలీసులపైన కూడా తిరగబడ్డారు. దీంతో కొందరు పోలీసులు కూడా స్వల్పంగా గాయపడ్డారు. 12 జ్యోతిర్లింగాలలో ఒకటైన ఈ ఆలయాన్ని గత నెలలోనే తెరిచారు. కనీసం ఇక డోసు వ్యాక్సిన్ తీసుకున్నవారు, లేదా 48 గంటల్లోగా కోవిడ్ టెస్ట్ చేయించుకుని నెగెటివ్ రిపోర్టు కలిగిన భక్తులను మాత్రమే అనుమతించాలని దేవస్థాన కమిటీ నిర్ణయించింది. అలాగే ఉదయం 6-8 గంటల మధ్య మూడున్నర వేలమందికి ఆలయ ప్రవేశం కల్పించాలని కూడా నిర్ణయించారు.

ఇందుకు ఏడు స్లాట్ లను నిర్దేశించి ఒక్కో స్లాట్ కి 500 మంది భక్తులను అనుమతించాలనుకున్నారు. కానీ వేల సంఖ్యలో వచ్చిన భక్తుల కారణంగా ఇవన్నీ వట్టి కాగితాలమీదే మిగిలిపోయాయి. పెద్ద సంఖ్యలో మహిళలు తమ పిల్లలతో సహా ఉదయం 5 గంటల నుంచే ఈ ఆలయానికి చేరుకున్నారు.అన్ని గేట్ల వద్దలైన్లలో నిలబడిన వీరిని పోలీసులు అదుపు చేయలేక చేతులెత్తేశారు. ఇది అధికారుల వైఫల్యమేనని కలెక్టర్ అంగీకరించారు. వీఐపీలు ఎక్కువ సంఖ్యలో వచ్చిన కారణం కూడా ఈ తొక్కిసలాటకు దారి తీసినట్టు కనిపిస్తోందన్నారు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

మరిన్ని ఇక్కడ చూడండి : వధువుకి గులాబ్‌ జామ్‌ ఇచ్చేందకు వరుడు తిప్పలు..!వధువులు ఎం చేసిందో చుడండి..వైరల్ వీడియో:Viral Video.

 రేషన్ కార్డు పంపిణిలో రగడ.. స్టేజ్ మీదే మైకులు లాక్కుని గొడవ చేసిన మంత్రులు..(వీడియో):Minister Vs MLA Video.

 ట్రైన్‌ కింద ప్రయాణికుడు…సూపర్‌ మ్యాన్‌ పోలీస్‌ రెస్క్యూ !వైరల్ అవుతున్న వీడియో..:Passenger Viral Video.

 భర్త చేసిన పాడు పనికి హీరోయిన్ రాజీనామా..ఆ కేసుకు నాకు ఎలాంటి సంబంధం లేదు..:Shilpa Shetty video.