SSC MTS 2021 : మల్టీ-టాస్కింగ్ స్టాఫ్ దరఖాస్తుల ప్రక్రియ ప్రారంభం.. వివరాలు ఇవిగో..

|

Feb 05, 2021 | 4:35 PM

వివిధ కేంద్ర ప్రభుత్వ విభాగాల్లోని మల్టీటాస్కింగ్ స్టాఫ్ పోస్టుల భర్తీకి స్టాఫ్ సెలక్షన్ కమిషన్ నోటిఫికేషన్ విడుదల చేసిన విషయం తెలిసిందే. పరీక్షా క్యాలెండర్ ప్రకారం ఎస్‌ఎస్‌సి..

SSC MTS 2021 : మల్టీ-టాస్కింగ్ స్టాఫ్ దరఖాస్తుల ప్రక్రియ ప్రారంభం.. వివరాలు ఇవిగో..
Follow us on

SSC MTS 2021 : వివిధ కేంద్ర ప్రభుత్వ విభాగాల్లోని మల్టీటాస్కింగ్ స్టాఫ్ పోస్టుల భర్తీకి స్టాఫ్ సెలక్షన్ కమిషన్ నోటిఫికేషన్ విడుదల చేసిన విషయం తెలిసిందే. పరీక్షా క్యాలెండర్ ప్రకారం ఎస్‌ఎస్‌సి ఎమ్‌టిఎస్ 2021 పరీక్షలు జూలై 1 నుంచి జూలై 20 వరకు జరగనున్నాయి. మల్టీ టాస్కింగ్ స్టాఫ్ (ఎమ్‌టిఎస్) నియామక పరీక్షకు ఫిబ్రవరి 5 (శుక్రవారం ) స్టాఫ్ సెలక్షన్ కమిషన్ (ఎస్‌ఎస్‌సి) రిజిస్ట్రేషన్ ప్రక్రియను ప్రారంభించనుంది. ఈమేరకు అప్లికేషన్ ఫారంతో పాటు పరీక్షకు సంబంధించిన ఇతర వివరాలు అధికారిక వెబ్‌సైట్ లో లభిస్తాయని కమిషన్ తెలిపింది.

ఎస్ఎస్‌సీ వెబ్‌సైట్ ద్వారా ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేయాలి. పదోతరగతి పాస్ అయిన వారు ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు. ఫిబ్రవరి 5 నుంచి ఆన్‌‌లైన్ దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం కావడంతో పోస్టులకు సంబంధించిన పూర్తి నోటిఫికేషన్‌ను ఎస్ఎస్సీ విడుదల చేసింది.  రాతపరీక్ష, స్కిల్‌టెస్ట్ ద్వారా ఎంపిక జరగనుంది. మరో వైపు ప్రభుత్వం కొత్తగా ప్రారంభించిన జాతీయ నియామక సంస్థ (ఎన్‌ఆర్‌ఏ) సెప్టెంబర్ నుంచి ఎస్‌ఎస్‌సికి పరీక్షలు నిర్వహించే అవకాశం ఉంది. ఏజెన్సీ మూడు స్థాయిలలో పరీక్షలను నిర్వహించనున్నారు. మెట్రిక్యులేషన్, ఇంటర్మీడియట్ మరియు గ్రాడ్యుయేషన్ స్థాయిలో పరీక్షలు జరగనున్నాయి. అలాగే ఎమ్‌టిఎస్‌తో పాటు ఎస్‌ఎస్‌సి ఇతర పరీక్షలలో కంబైన్డ్ గ్రాడ్యుయేట్ (సిజిఎల్) పరీక్ష మరియు కంబైన్డ్ హై సెకండరీ లెవల్ (సిహెచ్‌ఎస్‌ఎల్) పరీక్షను కూడా నిర్వహించనున్నారు.

మరిన్ని ఇక్కడ చదవండి :

ఎంసెట్ విద్యార్థులకు గుడ్‌న్యూస్.. ఇంటర్ మార్కుల వెయిటేజ్‌ యథాతథం.. స్పష్టం చేసిన ఉన్నత విద్యాశాఖ