స్పైస్‌జెట్ విమానం అత్యవసర ల్యాండింగ్ చేయబడింది. విమానంలో మంటలు చెలరేగడంతో ఎమర్జెన్సీ ల్యాండింగ్ చేసినట్లు సమాచారం. బీహార్‌లోని పాట్నా ఎయిర్‌పోర్టులో ఈ ఘటన చోటు చేసుకుంది. ఢిల్లీ వెళ్లే ఈ విమానాన్ని పాట్నా విమానాశ్రయంలో ల్యాండ్ చేశారు. ఈ విమానంలో 185 మంది ఉన్నారు. ఇప్పటి వరకు వచ్చిన నివేదిక ప్రకారం. విమానంలోని ప్రయాణికులందరూ సురక్షితంగా ఉన్నారు. పూర్తి వివరాల్లోకి వెళితే…
స్పైస్ జెట్ విమానంలో సాంకేతిక లోపం కారణంగా మంటలు చెలరేగటం గమనించిన సిబ్బంది చాకచక్యంగా వ్యవహించారు. ఘటన చోటు చేసుకున్న వెంటనే వెంటనే విమానాశ్రయ యంత్రాంగం అప్రమత్తమైంది. ప్రయాణికులందరినీ సురక్షితంగా బయటికి తరలించినట్లు అధికారులు తెలిపారు. సమాచారం ప్రకారం విమానం టేకాఫ్ అవుతుండగా ఇంజిన్‌లో మంటలు చెలరేగాయి. అగ్నిమాపక దళం, అగ్నిమాపక సిబ్బంది సంఘటనా స్థలానికి చేరుకున్నారు. నివేదిక ప్రకారం, ఈ విమానం పాట్నాలోని జైప్రకాష్ అంతర్జాతీయ విమానాశ్రయం నుండి 12.10 గంటలకు బయలుదేరింది. టేకాఫ్ అయిన కొద్ది నిమిషాలకే ఈ విమానం ఫ్యాన్‌లో మంటలు చెలరేగాయి. ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే.. ఈ విమానం ఫ్యాన్‌లో మంటలు ఎగిసిపడడాన్ని ప్రజలు కింది నుంచి చూశారు. విమానం ఫ్యాన్ నుంచి మంటలు రావడాన్ని ప్రజలు గమనించారు. ఈ ఘటనపై ప్రజలు వెంటనే పాట్నా పోలీసులకు సమాచారం అందించారు. అనంతరం ఘటనపై విమానాశ్రయానికి సమాచారం అందించారు. ఆ తర్వాత ఈ విమానాన్ని వెనక్కి తీసుకొచ్చారు.
మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి