Spicejet Plane: స్పైస్ జెట్ బోయింగ్ విమానంలో సాంకేతిక సమస్యలు.. సమస్యలతో నాసిక్ నుంచి తిరిగి ఢిల్లీకి..

ఈరోజు ఉదయం ఢిల్లీ ఇందిరాగాంధీ అంతర్జాతీయ విమానాశ్రయం నుంచి మహారాష్ట్రలోని నాసిక్‌కు బయలుదేరిన స్పైస్‌జెట్ విమానంలో ఆటోపైలట్ సమస్యలు..

Spicejet Plane: స్పైస్ జెట్ బోయింగ్ విమానంలో సాంకేతిక సమస్యలు.. సమస్యలతో నాసిక్ నుంచి తిరిగి ఢిల్లీకి..
Spicejet

Updated on: Sep 01, 2022 | 2:09 PM

స్పైస్ జెట్ బోయింగ్ విమానంలో సాంకేతిక సమస్యలు తలెత్తాయి. ఈరోజు ఉదయం ఢిల్లీ ఇందిరాగాంధీ అంతర్జాతీయ విమానాశ్రయం నుంచి మహారాష్ట్రలోని నాసిక్‌కు బయలుదేరిన స్పైస్‌జెట్ విమానంలో ఆటోపైలట్ సమస్యలు తలెత్తాయి. దీంతో.. నాసిక్ నుంచి తిరిగి ఢిల్లీకి ఫ్లైట్‌ వచ్చేసింది. బోయింగ్ 737 విమానం సురక్షితంగా ల్యాండ్ అయిందని DGCA తెలిపింది. గతంలో ఇలాంటి కొన్ని సంఘటనల వల్ల స్పైస్‌జెట్‌ యాజమాన్యానికి డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ షో-కాజ్ నోటీసు జారీ చేసింది. గతంలో నెలరోజుల వ్యవధిలోనే నాలుగు విమానాలకు పైగా సాంకేతిక సమస్యల నేపథ్యంలో యాజమాన్యానికి నోటీసులు ఇచ్చారు.

కాగా అధిక ఇంధన ధరలు,రూపాయి క్షీణత మధ్య ఆర్థిక సంక్షోభాన్ని ఎదుర్కొంటున్న స్పైస్‌జెట్ విమానాలు ఇబ్బందుల్లో పడిన ఘటనలు గతంలో కూడా వరుసగా చోటు చేసుకన్నాయి. దీంతో డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ విమానయాన సంస్థకు షో-కాజ్ నోటీసు జారీచేయడం, ఏవియేషన్ సేఫ్టీ రెగ్యులేటర్ ఎనిమిది వారాల పాటు గరిష్టంగా 50శాతం విమానాలను మాత్రమే రన్‌ చేయాలని జూలై 27న ఆదేశించిన సంగతి తెలిసిందే.

మరిన్ని జాతీయ వార్తల కోసం