AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Sonali Phogat: సోనాలీకి అన్ని కోట్ల ఆస్తులున్నాయా? ఇప్పుడామె కూతురు ప్రాణాలకూ ముప్పుందా? తెరపైకి సంచలన విషయాలు

Sonalii Phogat Death: హరియాణా బీజేపీ నేత, ప్రముఖ నటి సోనాలి ఫోగట్‌(43) అనుమానాస్పద మృతిపై మిస్టరీ కొనసాగుతోంది. మొదట ఆమె గుండెపోటుతో మరణించారని వార్తలు రాగా ఆతర్వాత హత్యగా నిర్ధారణ కావడం దేశ వ్యాప్తంగా సంచలనమైంది.

Sonali Phogat: సోనాలీకి అన్ని కోట్ల ఆస్తులున్నాయా? ఇప్పుడామె కూతురు ప్రాణాలకూ ముప్పుందా? తెరపైకి సంచలన విషయాలు
Sonali Phogat
Basha Shek
|

Updated on: Sep 01, 2022 | 2:00 PM

Share

Sonalii Phogat Death: హరియాణా బీజేపీ నేత, ప్రముఖ నటి సోనాలి ఫోగట్‌(43) అనుమానాస్పద మృతిపై మిస్టరీ కొనసాగుతోంది. మొదట ఆమె గుండెపోటుతో మరణించారని వార్తలు రాగా ఆతర్వాత హత్యగా నిర్ధారణ కావడం దేశ వ్యాప్తంగా సంచలనమైంది. సోనాలీకి బలవంతంగా డ్రగ్స్‌ ఇచ్చినట్లు పబ్‌ సీసీ టీవీ ఫుటేజ్ లో కనిపించించడం, పోస్టుమార్టం నివేదికలో ఆమె శరీరంలో పలుచోట్ల గాయాలు ఉండడంతో గోవా పోలీసులు హత్య కేసు నమోదు చేసి విచారణ చేపట్టారు. ఈ కేసుకు సంబంధించి ఇప్పటికే పలువురు నిందితులను అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. ఇక కుటుంబసభ్యుల విజ్ఞప్తి మేరకు ఫోగట్‌ కేసు విచారణను సీబీఐకి అప్పగిస్తామని గోవా సీఎం ప్రమోద్‌ సావంత్‌ తెలిపారు. అయితే అసలు సోనాలి ఫోగట్‌ హత్య వెనుక ఎవరున్నారు? ఆస్తి కోసమే ఆమెను చంపారా? వంటి కారణాలు ఇప్పుడు తెరమీదకి వస్తున్నాయి. ఈ నేపథ్యంలో సోనాలి ఫోగట్‌ కూతురు యశోధర ప్రాణానికి కూడా ముప్పు ఉన్నట్లు ఆమె కుటుంబసభ్యులు తెగ ఆందోళన చెందుతున్నారు.

కాగా సోనాలికి సుమారు రూ. 110 కోట్ల విలువైన ఆస్తులున్నట్లు తెలుస్తోంది. మరోవైపు 2016లో సోనాలి భర్త సంజయ్‌ ఫోగట్‌ కూడా అనుమానాస్పద రీతిలో చనిపోయారు. ఇప్పుడు సోనాలిని కూడా అదేవిధంగా హతమార్చారు. ఈనేపథ్యంలో ఆస్తి కోసం సోనాలి కూతురు యశోధరను కూడా హత్య చేయవచ్చని ఆమె కుటుంబీకులు ఆందోళన చెందుతున్నారు. ప్రస్తుతం యశోధరకు కేవలం 15 సంవత్సరాలే. తన ప్రాణాలకు ముప్పు ఉన్న నేపథ్యంలో యశోధరను తిరిగి హాస్టల్‌కు కూడా పంపకూడదని కుటుంబీకులు నిర్ణయం తీసుకున్నారట. తనకు పూర్తి స్థాయి భద్రత కల్పించాలని ప్రభుత్వాన్ని కూడా కోరారట.

ఇవి కూడా చదవండి

మరిన్ని జాతీయ వార్తలు  కోసం క్లిక్ చేయండి..