Corona Virus: భారతదేశం(India)లో కోవిడ్-19 (Covid 19)మరణాల రేటు అధికారిక డేటా కంటే చాలా ఎక్కువగా ఉందని మెడికల్ జర్నల్ ది లాన్సెట్(The Lancet) తాజాగా ఇచ్చిన నివేదికను కేంద్ర ప్రభుత్వం తిరస్కరించింది. అంతేకాదు కరోనా మహమ్మారి విజృంభణతో ప్రపంచ ప్రజారోగ్యం సంక్షోభంలో పడింది. ఈ సమయంలో వాస్తవాలు అంటూ చెప్పే విషయంలో చాలా సున్నితత్వంతో వ్యవహరించాలని కేంద్రం తెలిపింది. ది లాన్సెట్ నివేదికను “ఊహాజనితం, తప్పుడు సమాచారం” అని కేంద్రం పేర్కొంది. డిసెంబర్ 2021 నుంచి జనవరి 2020 మధ్య భారతదేశం ప్రకటించిన కరోనా మరణాల( Covid deaths) కంటే.. ఎనిమిది రెట్లు ఎక్కువ అని ప్రపంచంలోని పురాతన వైద్య పత్రిక ఒక నివేదికను ప్రచురించింది.
భారతదేశంలో అధిక జనాభా కారణంగా.. రాష్ట్రాలలో కోవిడ్ మరణాల రేటు ప్రపంచంలోనే అత్యధికం కాదని పేర్కొంది. అయితే డిసెంబర్ 31, 2021 నాటికి ప్రపంచవ్యాప్తంగా 22·3% అధిక మరణాలు సంభవించాయి. అదే సమయంలో ప్రపంచవ్యాప్తంగా అత్యధికంగా మహమ్మారి కారణంగా మరణాలు నమోదయ్యాయని.. ప్రపంచవ్యాప్తంగా సుమారు 18·2 మిలియన్ల మంది మరణించారని లాన్సెట్ పేపర్ అంచనా వేసింది. గతంలో అంచనా వేసిన దానికంటే దాదాపు మూడు రెట్లు ఎక్కువ. ఆ కాలంలో భారతదేశంలో కోవిడ్ కారణంగా దాదాపు 4,89,000 మంది మరణించారని జర్నల్ పేపర్ పేర్కొంది.
“COVID-19 మహమ్మారి కారణంగా మరణాల అంచనా: కోవిడ్ -19 సంబంధిత మరణాలపై క్రమబద్ధమైన విశ్లేషణ ప్రకారం 2020-21 మధ్య అధిక మరణాలు నమోదయ్యాయని.. ఊహించిన సంఖ్యతో పోల్చితే అదనపు మరణాలని.. అనే విషయంపై లాన్సెట్ నివేదిక ఇచ్చిందని.. దీనికి శాస్త్రీయత లేదని కేంద్ర ఆరోగ్య శాఖ తెలిపింది. లాన్సెట్ నివేదిక డేటాను అధ్యయనం చేయడానికి వివిధ దేశాలకు వేర్వేరు పద్ధతులను ఉపయోగించిందని కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ అభ్యంతరం తెలిపింది. ఉదాహరణకు.. భారతదేశంలోని కరోనా మరణాల లెక్కింపుకు అధ్యయనంకోసం ఉపయోగించిన డేటా మూలాధారాలు వార్తాపత్రిక నివేదికలు, నాన్-పీర్-రివ్యూడ్ స్టడీస్ నుండి తీసుకోబడినట్లు కనిపిస్తున్నాయని పేర్కొంది.
Also Read: