డీలిమిటేషన్‌పై దక్షిణ రాష్ట్రాల్లో ఆందోళన ఎందుకు? ఐదు.. ఒక్కటైతే ఢిల్లీ మాట వింటుందా?

డీలిమిటేషన్‌, పన్నుల వాటా, నీళ్ల వివాదాలు, రాజకీయ ప్రాతినిధ్యంపై దక్షిణాది రాష్ట్రాల్లో ఆందోళన పెరుగుతోంది. జనాభా నియంత్రణలో ముందున్న ఆంధ్రప్రదేశ్‌, తెలంగాణ, కర్ణాటక, తమిళనాడు, కేరళ రాష్ట్రాలు తమ ఆర్థిక పనితీరుకు తగిన ప్రాతినిధ్యం కోరుతున్నాయి. జనాభా ఆధారిత సీట్లతో పాటు GSDP, జనాభా నియంత్రణ వంటి అంశాలను పరిగణనలోకి తీసుకోవాలన్న డిమాండ్లు వినిపిస్తున్నాయి.

డీలిమిటేషన్‌పై దక్షిణ రాష్ట్రాల్లో ఆందోళన ఎందుకు? ఐదు.. ఒక్కటైతే ఢిల్లీ మాట వింటుందా?
Delimitation

Edited By:

Updated on: Aug 31, 2026 | 9:55 PM

భారత రాజకీయాల్లో మరోసారి దక్షిణం వర్సెస్‌ ఢిల్లీ అనే చర్చ తెరపైకి వచ్చింది. నీళ్లు, నిధులు, డీలిమిటేషన్‌, పన్నుల వాటా, రాజకీయ ప్రాతినిధ్యం.. ఐదు దక్షిణాది రాష్ట్రాల మధ్య వేర్వేరు సమస్యలు ఉన్నా.. కొన్ని అంశాల్లో మాత్రం ఒకే ఆందోళన కనిపిస్తోంది. ఆంధ్రప్రదేశ్‌, తెలంగాణ, కర్ణాటక, తమిళనాడు, కేరళ.. ఈ ఐదు రాష్ట్రాలు జనాభా నియంత్రణలో ముందున్నాయి. దేశ ఆర్థిక వ్యవస్థకు గణనీయమైన వాటా ఇస్తున్నాయి. జనాభా పెరుగుదలను నియంత్రించినందుకు రాజకీయంగా, ఆర్థికంగా దక్షిణాది రాష్ట్రాలు నష్టపోతున్నాయా? లేక జనాభా ఎక్కువగా ఉన్న రాష్ట్రాలకు ఎక్కువ ప్రాతినిధ్యం ఇవ్వడం సహజ ప్రజాస్వామ్య సూత్రమా అనే చర్చ సాగుతోంది. డీలిమిటేషన్‌.. అసలు భయం ఎక్కడ? 1971 జనాభా లెక్కల ఆధారంగా లోక్‌సభలో రాష్ట్రాల సీట్ల సంఖ్యను ఒక దశలో ఫ్రీజ్‌ చేశారు. జనాభా నియంత్రణ చేపట్టిన రాష్ట్రాలు భవిష్యత్తులో రాజకీయంగా నష్టపోకుండా ఉండటమే అందులో ప్రధాన ఉద్దేశం. 2001లో చేసిన రాజ్యాంగ సవరణ ద్వారా ఈ ఫ్రీజ్‌ను 2026 తర్వాత జరిగే తొలి జనగణన వరకు పొడిగించారు. ప్రస్తుత రాజ్యాంగ వ్యవస్థ ప్రకారం ఆ తర్వాత సీట్ల పునర్విభజనకు అవకాశం ఉంది. ఇప్పటికే 2026లో కేంద్రం Delimitation Bill, 2026, రాజ్యాంగ సవరణ బిల్లును లోక్‌సభలో ప్రవేశపెట్టింది. అయితే రాజ్యాంగ...

Loading...
Unable to load recommendations.
Follow Us

పూర్తి కథనాన్ని చదివేందుకు TV9 యాప్‌ని డౌన్‌లోడ్ చేయండి

ప్రత్యేకమైన కథనాలకు అపరిమితమైన యాక్సెస్ TV9 యాప్‌లో కొనసాగండి