DK Shivakumar: ఒప్పించారు.. ఓకే చెప్పించారు.. ఒక్క కాల్‌తో దిగివచ్చిన శివకుమార్.. ఆ ఫోన్ చేసింది ఎవరో తెలుసా..

|

May 18, 2023 | 11:46 AM

క‌ర్నాట‌క‌లో కొత్త ముఖ్యమంత్రి ఎవ‌ర‌నేది తేలిపోయింది. మాజీ సీఎం సిద్ధరామయ్యను ముఖ్యమంత్రిని చేస్తారని, డీకే శివకుమార్‌ను డిప్యూటీ సీఎంగా చేస్తారని విశ్వసనీయవర్గాల సమాచారం. ఇద్దరు నేతలు ప్రస్తుతం ఢిల్లీలోనే ఉన్నారు. అయితే ముందు నుంచి సీఎం పీఠం కోసం పోటీ పడిన డీకే.. చివరికి డిప్యూటీతో సరిపెట్టుకున్నారు. డీకేను ఒప్పించడంలో ఎవరు కీ రోల్ పోషించారన్నది కీలకంగా మారింది.

DK Shivakumar: ఒప్పించారు.. ఓకే చెప్పించారు.. ఒక్క కాల్‌తో దిగివచ్చిన శివకుమార్.. ఆ ఫోన్ చేసింది ఎవరో తెలుసా..
Sonia Gandhi big role in DK Shivakumar accepting
Follow us on

కర్నాటక తదుపరి ముఖ్యమంత్రి సిద్ధరామయ్య కాగా, డీకే శివకుమార్ ఉప మంత్రి అవుతారు. దీని అధికారిక ప్రకటన ఇంకా వెలువడనప్పటికీ పార్టీ పెద్దలు ఇదే నిర్ణయానికి వచ్చినట్లుగా సమాచారం. పార్టీ వర్గాల నుంచి వచ్చిన సమాచారం ప్రకారం, పార్టీ నాయకులు బుధవారం రాత్రే దీనికి ఆమోదం తెలిపారు. ముఖ్యమంత్రి కావాలనే పట్టుదలతో ఉన్న శివకుమార్ ఇప్పుడు ఆయన్ను ఒప్పించడంలో పార్టీ మాజీ అధ్యక్షురాలు సోనియాగాంధీ కీ రోల్ పోషించినట్లుగా సమాాచారం. సోనియా గాంధీ జోక్యంతో డీకే శివకుమార్ కర్నాటక ఉపముఖ్యమంత్రిగా ఉండేందుకు అంగీకరించినట్లు సంబంధిత వర్గాలు పేర్కొన్నాయి. సోనియాగాంధీతో ఫోన్‌లో మాట్లాడిన తర్వాత డీకే శివకుమార్ ఉప ముఖ్యమంత్రి పదవికి అంగీకరించినట్లు పార్టీ వర్గాలు చెబుతున్నాయి. సోనియాగాంధీతో మాట్లాడే ముందు శివకుమార్ ముఖ్యమంత్రి కావాలనే పట్టుదలతోనే ఉన్నారు.

కర్ణాటకలో ముఖ్యమంత్రి, ఉపముఖ్యమంత్రి పేర్లను అధికారికంగా ఇవాళ ప్రకటించే అవకాశం ఉంది. కర్ణాటక ఎన్నికల్లో విజయం వెనుక డీకే శివకుమార్‌ పాత్ర ఎంతో ఉంది. ఎన్నికల్లో గెలిచిన తర్వాత వచ్చిన చాలా మంది ఎమ్మెల్యేల మద్దతు కూడా ఆయనకే ఉంది. సిద్ధరామయ్య, శివకుమార్ ఇద్దరూ నిన్న అంటే బుధవారం కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే, రాహుల్ గాంధీ, పార్టీ ప్రధాన కార్యదర్శి కెసి వేణుగోపాల్‌తో సమావేశమయ్యారు.

ఎన్ని సార్లు చర్చలు జరిపినా తమకే ముఖ్యమంత్రి పీఠం కావాలంటూ పట్టువీడలేదు ఇద్దరు నేతలు. ఎన్ని విధాలుగా చెప్పేందుకు ప్రయత్నిచినప్పటికీ ససేమిరా అన్నట్లుగా వార్తలు వచ్చాయి. అయితే చివరి ప్రయత్నంగా డీకేను డిప్యూటీకి ఒప్పించే ప్రయత్నం చేశారు సోనియా.. దీంతో తన షరతులను పక్కన పెట్టి ఓకే చెప్పారు డీకే.

సోనియా గాంధీ బుధవారం సాయంత్రం డీకే శివకుమార్‌తో ఫోన్‌లో మాట్లాడినట్లు సంబంధిత వర్గాలు పేర్కొన్నాయి. ఆ తర్వాత కాంగ్రెస్ పార్టీని అమ్మా అని పిలిచిన డీకే శివకుమార్ కర్నాటకలో నెంబర్ టూ స్థానాన్ని కైవసం చేసుకున్నారు. అయితే మంత్రివర్గంలో చేరే నేతలపై పార్టీలో ఇంకా చర్చలు సాగుతున్నాయి.

సిద్ధరామయ్య గతంలో కూడా కర్ణాటక ముఖ్యమంత్రిగా ఉన్నారు. ఆయనకు కర్ణాటక ప్రజల నుంచి బలమైన మద్దతు కూడా ఉంది. మరోవైపు పార్టీ సంస్థాగత పనిపై డీకే శివకుమార్ పట్టు సాధించారు. క్లిష్ట సమయాల్లో కాంగ్రెస్ ట్రబుల్షూటర్‌గా పేరుంది. కర్ణాటకలో ముఖ్యమంత్రి ప్రమాణ స్వీకారోత్సవం శనివారం జరగనుంది.

అందుతున్న సమాచారం ప్రకారం సిద్ధరామయ్య, డీకే శివకుమార్‌ల ముందు అధికార భాగస్వామ్యం కోసం ప్రతిపాదన కూడా చేయబడింది. దీని కోసం 2+3 ఫార్ములా ప్రవేశపెట్టబడింది. అంటే సిద్ధరామయ్య రెండేళ్లు, డీకే శివకుమార్ మూడేళ్లు ముఖ్యమంత్రిగా ఉంటారని తెలుస్తోంది.

మరిన్ని జాతీయ వార్తల కోసం