Sonali Phogat Death Case: ఫోగట్‌ను ఎందుకు హత్య చేశారు?.. గోవా పోలీసుల ముమ్మర దర్యాప్తు.. మరో ఇద్దరు అరెస్ట్..

|

Aug 27, 2022 | 4:59 PM

Sonali Phogat Murder Case: ఇప్పటికే సోనాలి ఫోగట్‌ ఇద్దరు పీఏలు సుఖ్విందర్‌సింగ్‌ , సుధీర్‌ సాగ్వాన్‌ను పోలీసులు తమ అదుపు లోకి తీసుకొని విచారిస్తున్నారు. సుఖ్విందర్‌సింగ్‌, సుధీర్‌ సాగ్వాన్‌ను గోవా పోలీసులు కోర్టులో హాజరుపర్చారు.

Sonali Phogat Death Case: ఫోగట్‌ను ఎందుకు హత్య చేశారు?.. గోవా పోలీసుల ముమ్మర దర్యాప్తు.. మరో ఇద్దరు అరెస్ట్..
Sonali Phogat
Follow us on

Sonali Phogat Murder Case Updates: టిక్‌టాక్‌ స్టార్‌, బీజేపీ నేత సోనాలి ఫోగట్‌ హత్య కేసులో మరో ఇద్దరి వ్యక్తులను గోవా పోలీసులు అరెస్ట్‌ చేశారు. క్లబ్ యాజమానితో పాటు ఓ డ్రగ్‌ పెడ్లర్‌ను అరెస్ట్‌ చేసినట్లు పోలీసులు వెల్లడించారు. పోలీసులు ఇప్పటికే సోనాలి ఫోగట్‌ ఇద్దరు పీఏలు సుఖ్విందర్‌సింగ్‌ , సుధీర్‌ సాగ్వాన్‌ను పోలీసులు తమ అదుపు లోకి తీసుకొని విచారిస్తున్నారు. సుఖ్విందర్‌సింగ్‌, సుధీర్‌ సాగ్వాన్‌ను గోవా పోలీసులు కోర్టులో హాజరుపర్చారు. ఇద్దరు నిందితులకు న్యాయస్థానం 10 రోజుల పోలీసు కస్టడీ విధించింది. వీళ్లిద్దరే సోనాలి ఫోగట్‌కు సింథటిక్‌ డ్రగ్‌ బలవంతంగా ఇచ్చినట్లు గోవా పోలీసులు తమ ప్రాథమిక విచారణలో నిర్థారించడం తెలిసిందే.

ఈ నెల 23న సోనాలి ఫోగట్ గుండెపోటుతో మరణించినట్లు తొలత భావించారు. అయితే ఆమె మృతదేహంపై పలుచోట్ల గాయాలున్నట్లు పోస్ట్‌మార్టం నివేదికలో తేలింది. ఫోగట్ కుటుంబ సభ్యులు ఆమె మరణంపై అనుమానాలు వ్యక్తంచేయడంతో గోవా పోలీసులు మర్డర్ కేసు నమోదు చేసి దర్యాప్తు జరిపారు. పోలీసుల దర్యాప్తులో ఆమెది సహజ మరణం కాదని.. మర్డర్‌గా నిర్థారించారు. తమ విచారణలో ఫోగట్ కు కెమికల్ డ్రగ్ ఇచ్చినట్లు తేలిందని.. నిందితులు ఆ విషయాన్ని ఒప్పుకున్నట్లు గోవా ఇన్‌స్పెక్టర్ జనరల్ ఓంవీర్ సింగ్ బిష్ణోయ్ మీడియాకు తెలిపారు. సోనాలీ ఫోగట్‌కు నిందితుడు బలవంతంగా డ్రగ్స్‌ ఇచ్చినట్లు పబ్ సిసిటీవీ ఫుటేజ్ లో కనిపించింది. కెమికల్ డ్రగ్ తీసుకున్న తర్వాత ఆమె నియంత్రణలో లేరని.. ఫోగట్ హత్యకు కారకులైన ఇద్దరినీ అరెస్టు చేసి విచారిస్తున్నట్లు ఓం వీర్ సింగ్ బిష్ణోయ్ తెలిపారు. సోనాలి ఫోగట్‌కు బలవంతంగా డ్రగ్స్‌ ఇచ్చి అత్యాచారం చేసి చంపేశారని కుటుంబసభ్యులు ఆరోపిస్తున్నారు. సుఖ్విందర్‌సింగ్‌ , సుధీర్‌ సాగ్వాన్‌ ఆమెను హత్య చేశారని , వాళ్లిద్దరిని కఠినంగా శిక్షించాలని డిమాండ్‌ చేస్తున్నారు.

ఇవి కూడా చదవండి

Sonali Phogat

సుఖ్విందర్‌సింగ్‌, సుధీర్‌ సాగ్వాన్‌ను గోవా పోలీసులు ప్రశ్నిస్తున్నారు. ఫోగట్‌ను ఎందుకు హత్య చేశారన్న అంశంపై నిందితులను ప్రశ్నిస్తున్నారు. విచారణలో అన్ని వాస్తవాలు బయటకు వస్తాయని గోవా పోలీసులు తెలిపారు. కేసు దర్యాప్తులో పురోగతి ఏర్పడిన తర్వాత అన్ని వివరాలు మీడియాకు వెల్లడిస్తామని గోవా ఐజీపీ తెలిపారు.

మరిన్ని జాతీయ వార్తలు చదవండి..