జమ్మూ కాశ్మీర్లో ఎస్సెమ్మెస్ ల పునరుధ్ధరణ

|

Jan 01, 2020 | 12:25 PM

నూతన సంవత్సరం రోజున జమ్మూ కాశ్మీర్ ప్రజలకు కేంద్రం తీపి కబురు అందించింది. ఈ రాష్ట్రంలో అన్ని మొబైల్ ఫోన్లలో ఎస్సెమ్మెస్ సౌకర్యాలను మంగవరం అర్ధరాత్రి నుంచి పునరుధ్ధరించింది. అలాగే ప్రభుత్వ ఆధ్వర్యంలో నడిచే అన్ని ఆసుపత్రుల్లో బ్రాడ్ బాండ్ ఇంటర్నెట్ సర్వీసులను కూడా తిరిగి అనుమతించారు. సుమారు అయిదు నెలలుగా వీటిపై ఆంక్షలు కొనసాగుతున్న సంగతి విదితమే.. 370 అధికరణాన్ని రద్దు చేసిన అనంతరం గత ఆగస్టు 5 న మోదీ ప్రభుత్వం అన్ని ఇంటర్నెట్, […]

జమ్మూ కాశ్మీర్లో ఎస్సెమ్మెస్ ల పునరుధ్ధరణ
Follow us on

నూతన సంవత్సరం రోజున జమ్మూ కాశ్మీర్ ప్రజలకు కేంద్రం తీపి కబురు అందించింది. ఈ రాష్ట్రంలో అన్ని మొబైల్ ఫోన్లలో ఎస్సెమ్మెస్ సౌకర్యాలను మంగవరం అర్ధరాత్రి నుంచి పునరుధ్ధరించింది. అలాగే ప్రభుత్వ ఆధ్వర్యంలో నడిచే అన్ని ఆసుపత్రుల్లో బ్రాడ్ బాండ్ ఇంటర్నెట్ సర్వీసులను కూడా తిరిగి అనుమతించారు. సుమారు అయిదు నెలలుగా వీటిపై ఆంక్షలు కొనసాగుతున్న సంగతి విదితమే.. 370 అధికరణాన్ని రద్దు చేసిన అనంతరం గత ఆగస్టు 5 న మోదీ ప్రభుత్వం అన్ని ఇంటర్నెట్, లాండ్ లైన్, మొబైల్ ఫోన్ల సర్వీసులపై ఆంక్షలు విధించింది.

కాశ్మీర్లోని జిల్లాల్లో గల టూరిస్టు స్పాట్లు, హోటళ్లలో దాదాపు 90 ఇంటర్నెట్ టచ్ పాయింట్లు పని చేస్తున్నాయని ప్రభుత్వ అధికారి ఒకరు తెలిపారు. దీనివల్ల సుమారు 6 లక్షల మంది ప్రయోజనం పొందుతున్నట్టు ఆయన చెప్పారు. ఇక నిర్బంధంలో ఉన్న రాజకీయ నాయకుల విడుదలపై కేంద్రమే ఒక నిర్ణయం తీసుకోవలసి ఉందని ఆయన పేర్కొన్నారు. శాంతి భద్రతల పరిస్థితిని బట్టి బహుశా ప్రభుత్వం త్వరలోనే దీనిపై ఖఛ్చితమైన నిర్ణయానికి వస్తుందని భావిస్తున్నామని ఆయన అన్నారు.