Smart City Awards 2020: మోడీ ప్రభుత్వంలో ముఖ్యమైన ప్రాజెక్టులలో ఒకటైన స్మార్ట్ సిటీ మిషన్ 6 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా ఇండియా స్మార్ట్ సిటీ పోటీ -2020 ఫలితాలను శుక్రవారం ప్రకటించారు. వర్చువల్ కార్యక్రమంలో ఉత్తమ సిటీలకు కేంద్ర హౌసింగ్, పట్టణ వ్యవహారాల మంత్రి హర్దీప్ సింగ్ పూరి అవార్డులు ఇచ్చారు. 100 స్మార్ట్ సిటీలలో మొత్తం పనితీరు పరంగా.. సూరత్, ఇండోర్ సంయుక్తంగా మొదటి స్థానంలో నిలిచాయి. రాష్ట్రాల్లో ఉత్తర ప్రదేశ్ ముందంజలో ఉంది. మధ్యప్రదేశ్ మొదటి రన్నరప్ స్థానంలో, తమిళనాడు రెండవ రన్నరప్‌గా ఎంపికైంది. 2019 లో స్మార్ట్ సిటీస్‌లో సూరత్ ఒంటరిగా గెలిచింది. కానీ, ఈసారి ఆ వార్డును ఇండోర్ తో కలిసి పంచుకుంటోంది.
ఉత్తరప్రదేశ్ 7 నగరాలను స్మార్ట్ సిటీలుగా చేసింది. అందుకే, ఇది నంబర్ -1 రాష్ట్రంగా నిలిచింది. రాష్ట్రాల మొత్తం పనితీరు, వాటి నగరాల్లో మెరుగైన పాత్ర కోసం గృహ, పట్టణ వ్యవహారాల మంత్రిత్వ శాఖ అవార్డులు ఇవ్వడం ఇదే మొదటిసారి. మీరట్, ఘజియాబాద్, అయోధ్య, ఫిరోజాబాద్, గోరఖ్పూర్, మధుర-బృందావన్, సహారన్పూర్ నగరాలు ఏడిటిని స్మార్ట్ సిటీలుగా చేసినందుకు ఉత్తరప్రదేశ్ మొదటి స్థానంలో నిలవ గలిగింది.
కోవిడ్ ఇన్నోవేషన్ విభాగంలో సంక్షేమ మంత్రిత్వ శాఖ, రెండు పట్టణాలను ఉమ్మడి విజేతలుగా ప్రకటించారు. మహారాష్ట్రలోని కళ్యాణ్-డోంబివ్లి, ఉత్తరప్రదేశ్ లోని వారణాసి ఈ అవార్డును సంయుక్తంగా గెలుచుకున్నాయి. మిషన్ కింద 5,924 ప్రతిపాదిత ప్రాజెక్టుల మొత్తం వ్యయం రూ .1.78 లక్షల కోట్లు అని మంత్రిత్వ శాఖ తెలిపింది. వీటికి టెండర్లు చేశారు. 5,236 ప్రాజెక్టులకు వర్క్ ఆర్డర్లు జారీ చేశారు. రూ .45,080 కోట్ల విలువైన 2,665 ప్రాజెక్టులు పూర్తయ్యాయి ఇతర పనులు వేగంగా జరుగుతున్నాయి.
70 స్మార్ట్ సిటీలు తమ సొంత ఇంటిగ్రేటెడ్ కమాండ్ అండ్ కంట్రోల్ సెంటర్లను అభివృద్ధి చేశాయని మంత్రిత్వ శాఖ తెలిపింది. మిషన్ కింద తయారుచేసిన మౌలిక సదుపాయాలతో పాటు, అవి కోవిడ్ నిర్వహణకు వార్ రూమ్స్ గా కూడా పనిచేస్తున్నాయి. మొత్తం 100 నగరాల్లో ఇటువంటి కేంద్రాలను అభివృద్ధి చేస్తున్నారు. క్లైమేట్ స్మార్ట్ సిటీస్ అసెస్‌మెంట్ ఫ్రేమ్‌వర్క్ (సిఎస్‌సిఎఎఫ్) 2.0 పై మంత్రిత్వ శాఖ ఒక నివేదికను విడుదల చేసింది. ఇందులో 126 నగరాలు పాల్గొన్నాయి. ఉత్తమంగా పనిచేస్తున్న 9 నగరాలు 4 నక్షత్రాలుగా రేట్ చేయబడ్డాయి. వీటిలో సూరత్, ఇండోర్, అహ్మదాబాద్, పూణే, విజయవాడ, రాజ్‌కోట్, విశాఖపట్నం, పింప్రి-చిన్చ్వాడ్ అలాగే వడోదర ఉన్నాయి. స్మార్ట్ సిటీస్ లీడర్‌షిప్ అవార్డుకు అహ్మదాబాద్, వారణాసి, రాంచీ ఎంపికయ్యాయి.