హిమాచల్ ప్రదేశ్‌లో నాలుగు అంతస్థుల భవనం కుప్పకూలింది. భారీ వర్షాలకు సొలాన్‌లో భవనం ఒక్కసారిగా పడిపోవడంతో ఏడుగురు మృతిచెందారు. అందులో ఆరుగురు ఆర్మీ జవాన్లు ఉన్నారు. నహాన్ కుమర్‌హట్టి రోడ్డులో ఉన్న ఈ బిల్డింగ్‌లో రెస్టారెంట్ నిర్వహిస్తున్నారు. ప్రమాదం జరిగిన సమయంలో దాదాపు 37 మంది ఆ రెస్టారెంట్‌లో తెలుస్తుంది.
ప్రమాదం జరిగిన వెంటనే ఘటనాస్థలికి చేరుకున్న రెస్క్యూ సిబ్బంది 28 మందిని కాపాడారు. వీరిలో 17మంది ఆర్మీ జవాన్లు… 11 మంది సామాన్య పౌరులు ఉన్నారు. ప్రాణాలు కోల్పోయిన ఏడుగురి మృతదేహాల్ని శిథిలాల కింద గుర్తించారు. మరికొంతమంది శిథిలాల కింద చిక్కుకున్నట్లు తెలియడంతో… వారిని కాపాడేందుకు సహాయక చర్యలు కొనసాగుతున్నాయి.
#BuildingCollapsed at Solan two team of #NDRF deployed for rescue operation. pic.twitter.com/F8zVDZXEIW
— NDRF (@NDRFHQ) July 14, 2019