UPSC Toppers: స్కూలు, కాలేజీల్లో అందరూ కలిసే చదువుకుంటారు. కానీ ఒకరు IIT JEEలో ర్యాంక్ హోల్డర్ అయితే మరొకరు UPSC పరీక్ష క్లియర్ చేస్తారు. కానీ, ఒకే నోట్స్ చదివిన ఇద్దరు అక్కాచెల్లెలు మాత్రం కలిసి IAS అధికారి కావాలనే తమ కలను నెరవేర్చుకున్నారు. ఇద్దరు అక్కాచెల్లెల్లు ఒకే నోట్స్ చదివి UPSC పరీక్షకు సిద్ధమయ్యారు. అక్క 3వ ర్యాంక్ సాధించింది. చెల్లెలు 21వ ర్యాంక్ కొట్టింది. ఢిల్లీకి చెందిన అంకితా జైన్, ఆమె సోదరి వైశాలి జైన్ IAS విజయ గాథ అందరికీ ఆదర్శంగా నిలుస్తోంది.
UPSC టాపర్ అంకితా జైన్, వైశాలి జైన్ సక్సెస్ స్టోరీ ఇది..UPSC సివిల్ సర్వీస్ పరీక్ష చాలా కష్టతరమైన పరీక్షలలో ఒకటిగా చెబుతారు. ఎందుకంటే దీని కోసం విద్యార్థులు చాలా కష్టపడి చదవాల్సి ఉంటుంది. కానీ కొంతమంది విద్యార్థులు సులభంగా విజయం సాధిస్తారు. ఇలాంటి కథే ఢిల్లీకి చెందిన అంకితా జైన్, ఆమె సోదరి వైశాలి జైన్ విజయగాథ. ఇద్దరూ ఒకే నోట్స్ చదివి IAS అధికారి కావాలనే కలను నెరవేర్చుకున్నారు. అక్క అంకిత మూడో ర్యాంక్, చెల్లెలు వైశాలి 21వ ర్యాంక్ సాధించారు. అంకితా జైన్, ఆమె చెల్లెలు వైశాలి జైన్ కలిసి చదువుకున్నారు. కలిసి UPSC పరీక్షకు హాజరయ్యారు. అక్కాచెల్లెళ్లిద్దరూ కలిసి విజయం సాధించి ఇద్దరూ ఐఏఎస్‌లుగా మారారు.
అంకితా జైన్, ఆమె చెల్లెలు వైశాలి జైన్ UPSC పరీక్షకు సిద్ధం కావడానికి ఒకే స్టడీ మెటిరీయల్ చదువుకున్నారు. దీంతో పాటు చదువుకునే సమయంలో ఒకరినొకరు ప్రోత్సహించుకుంటూ ప్రిపరేషన్‌లో సహకరించుకున్నారు. అంకిత నాలుగో ప్రయత్నంలో విజయం సాధించింది. 12వ తరగతి తర్వాత అంకిత జైన్ ఢిల్లీ టెక్నలాజికల్ యూనివర్శిటీ నుంచి కంప్యూటర్ సైన్స్‌లో బి.టెక్ పట్టా పొందారు. దీని తర్వాత, ఆమె ఒక ప్రైవేట్ కంపెనీలో ఉద్యోగం సంపాదించారు. కానీ కొంతకాలం తర్వాత ఆమె తన ఉద్యోగం వదిలి UPSC పరీక్షకు సిద్ధమయ్యారు. అయితే ఉద్యోగం వదిలేసి యూపీఎస్సీ పరీక్షలో ఉత్తీర్ణత సాధించడం ఆమెకు అంత తేలిక కాదు. కష్టపడినా నాలుగో ప్రయత్నంలో విజయం సాధించి సివిల్ సర్వీస్ కలను నెరవేర్చుకుంది.
వైశాలి జైన్ తన అక్క అంకితా జైన్ సలహాలు, సూచనలతో మంచి ప్రయోజనం పొందింది. UPSC పరీక్షలో విజయం సాధించింది. అంకిత సహాయంతో ప్రిపేర్ కావడం ద్వారా వైశాలి సివిల్ సర్వీసెస్ ఎగ్జామ్ 2020 (CSE ఎగ్జామ్ 2020)లో 21వ ర్యాంక్ సాధించింది. వైశాలి ఉద్యోగం చేస్తూనే యూపీఎస్సీ పరీక్షకు సిద్ధమైంది.
మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి