
ఫస్ట్ వికెట్… ప్రభుత్వం లోపలున్న ధర్మేంద్రప్రధాన్. సెకండ్ వికెట్… ప్రభుత్వానికి వెలుపలున్న జ్ఞానేష్‌కుమార్. 48 గంటల డెడ్‌లైన్ ఇస్తున్నాం. రాజీనామా చెయ్యకపోతే మళ్లీ జంతర్‌మంతరే..! ఇట్స్ ఆల్ డన్ బ్రో అని కన్నెగరేస్తూ వార్నింగ్ ఇచ్చింది కాక్రోచ్‌పార్టీ. ఇంత గట్టిగా అల్టిమేటమ్ ఇచ్చి కూడా నాలుగైదురోజులు గడిచిపోయాయ్. ఐనా, ఢిల్లీ గల్లీల్లో ఉలుకూ పలుకూ లేదు. జంతర్‌మంతర్ దగ్గర బొద్దింకల చప్పుడే లేదు. అన్నీ ఉడుత ఊపులేనా అని ఎద్దేవా చేస్తోంది బీజేపీ. సరిగ్గా ఇదే టైమ్‌లో ఎస్‌ఐఆర్ వ్యాక్యూమ్‌ని క్యాప్చర్ చెయ్యాలని స్కెచ్చేసినట్టుంది కాంగ్రెస్ పార్టీ. ఆలిండియా కాక్రోచ్ పార్టీ ప్లాన్‌ని చాలా జాగ్రత్తగా హైజాక్ చేసినట్టుంది ఆలిండియా కాంగ్రెస్ పార్టీ. మూడు గంటలపాటు వాడీవేడిగా జరిగిన సీడబ్ల్యూసీ మీటింగ్ తర్వాత వచ్చిన ఫైనల్ ఔట్‌కమ్ ఇది. ప్రజాస్వామ్యం ప్రమాదంలో పడిందని, ఎన్నికల వ్యవస్థ వైఫల్యాలకు మోదీనే నైతిక బాధ్యత వహించాలని.. ఇప్పటికిప్పుడు జ్ఞానేష్ కుమార్ రాజీనామా చేయాలని.. ఇలా రొటీన్ డిమాండ్లతోనే కాదు.. పటిష్టమైన ప్రణాళిక కూడా రాసుకున్నాం.. రాహుల్ చేతిలో పెట్టేశాం.. ఇంప్లిమెంటేషనే మిగిలింది అని ఏఐసీసీ నుంచి ఎన్‌డీఏ కూటమికి సాలిడ్‌గానే వెళ్లింది వార్నింగ్. ఇప్పటిదాకా జరిగిన ఎన్నికలన్నీ ఫార్సు అని, ప్రతీ ఓటు చోరీకి గురైందని గట్టిగానే వాదించాలనుకుంటోంది...