AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

SIM Cards: మీ పేరుపై ఎన్ని సిమ్ కార్డులు ఉన్నాయి..? ఒకే ఒక్క క్లిక్‌తో తెలుసుకోవచ్చు.. ఎలా అంటే..?

కేంద్ర ప్రభుత్వం షాకింగ్ డెసిషన్ తీసుకుంది. ఆగస్ట్ 24 నుంచి ఒక వ్యక్తి తొమ్మిది సిమ్ కార్డుల కంటే ఎక్కువ తీసుకోలేరు. ఈ మేరకు కేంద్రం కొత్త నిబంధనలు ప్రవేశపెట్టింది. ఈశాన్య రాష్ట్రాల్లోని ప్రజలు ఆరు సిమ్ కార్డుల కంటే ఎక్కువ తీసుకోలేరు.

SIM Cards: మీ పేరుపై ఎన్ని సిమ్ కార్డులు ఉన్నాయి..? ఒకే ఒక్క క్లిక్‌తో తెలుసుకోవచ్చు.. ఎలా అంటే..?
Sim Cards
Venkatrao Lella
|

Updated on: Aug 22, 2026 | 2:36 PM

Share

కేంద్ర ప్రభుత్వం సిమ్ కార్డు నిబంధనల్లో కీలక మార్పులు చేసింది. గరిష్ట పరిమితులు విధిస్తూ నిర్ణయం తీసుకుంది. ఇక నుంచి ఒక వ్యక్తి తొమ్మిది సిమ్‌ల కంటే ఎక్కువ పొందలేరు. అంతకంటే ఎక్కువ సిమ్‌లు కావాలంటే టెలికాం కంపెనీలు జారీ చేయవు. ఈ మేరకు కేంద్ర ప్రభుత్వం ఆగస్ట్ 24 నుంచి ఈ రూల్స్ అమలు చేయనుంది. ఇప్పటికే మీరు తొమ్మిది సిమ్ కార్డులు మీ పేరుపై కలిగి ఉంటే.. 24వ తేదీ నుంచి కొత్త సిమ్‌లు పొందలేరు. ఇక జమ్మూకశ్మీర్, అస్సాం, ఈశాన్య రాష్ట్రాల్లో ఒక వ్యక్తి ఆరు సిమ్ కార్డులను గరిష్టంగా పొందవచ్చు. దీంతో మీరు కొత్తగా సిమ్ తీసుకోవాలని అనుకుంటంటే మీ పేరుపై ఇప్పటికే ఎన్ని సిమ్‌లు ఉన్నాయనేది తెలుసుకోవాలి. అదెలా అనేది ఇప్పుడు చూద్దాం.

మీ పేరుపై ఎన్ని సిమ్‌లు ఉన్నాయో తెలుసుకోవడం ఎలా..?

-ముందుగా సంచార్ సౌథీ యాప్‌లోకి వెళ్లండి

-హోమ్ పేజీలో మీ పేరుపై ఉన్న మొబైల్ కనెక్షన్లను తెలుసుకోండి అనే ఆప్షన్‌పై క్లిక్ చేయండి

-అనంతరం మీ మొబైల్ నెంబర్ ఎంటర్ చేయండి

-క్యాప్చాను ఎంటర్ చేయండి

-మీ మొబైల్ నెంబర్‌కు వచ్చే ఓటీపీని నమోదు చేయండి

-మీ పేరుపై ఉండే మొబైల్ కనెక్షన్లను చూడటానికి లాగిన్ అవ్వండి

-అనంతరం పే పేరుపై ఉన్న మొబైల్ నెంబర్లు కనిపిస్తాయి

మీకు తెలియని నెంబర్ కనిపిస్తే ఏం చేయాలి..?

ఈ వెబ్ సైట్లో మీ పేరుపై తెలియని సిమ్ ఉంటే దానిని మీరు గుర్తించవచ్చు. అలాగే దానిపై ఫిర్యాదు చేయవచ్చు. మొబైల్ నెంబర్ పక్కన ఉడే చెక్ బ్యాక్స్ ఉపయోగించి సంబంధిత నెంబర్ ఎంచుకోవాలి. అనంతరం రిపోర్ట్ చేయాల్సి ఉంటుంది. కనెక్షనన్ కోసం అవసరమైన ప్రక్రియను పూర్తి చేసి డిస్ కనెక్ట్ చేయాలి. దీని వల్ల మీకు భవిష్యత్తులో ఇబ్బంది లేకుండా ఉంటుంది. మీ పేరుపై  సైబర్ నేరగాళ్లు సిమ్ కార్డులు తీసుకుని నేరాలకు పాల్పడే అవకాశముంది. అప్పుడు మీరే నేరం చేసినట్లు అవుతుంది. అందుకే మీ పేరుపై ఎన్ని సిమ్ కార్డులు ఉన్నాయనేది ఖచ్చితంగా చెక్ చేసుకోవాలి.

కేంద్రం కొత్త రూల్స్ ఎందుకు..?

మొబైల్ కనెక్షన్లలో దుర్వినియోగాన్ని అరికట్టడంతో పాటు మీ పేరుపై నమోదైన సిమ్ కార్డును సులభంగా గుర్తించేలా చేయడంలో భాగంగా కేంద్రం ఈ రూల్స్ తీసుకొచ్చింది. ఈ మేరకు టెలికమ్యూనికేషన్ల శాఖ అధికారికంగా నోటిఫికేషన్ జారీ చేసింది.

Follow Us