అబ్బో.. వీడెవడో పుష్పకి గురువుగారిలా ఉన్నాడే!.. నోరెళ్లబెట్టిన పోలీసులు

అల్లు అర్జున్‌ మువీ 'పుష్ప' మువీ చూడని వారు దాదాపు ఉండరు. ఈ మువీలో పోలీసుల కళ్లు గప్పి పుష్ప కోట్ల విలువైన స్మగ్లింగ్‌ గూడ్స్ అవలీలగా టార్గెట్ పాయింట్‌కు చేర్చడం చూపరులకు కాస్త విస్మయానికి గురి చేస్తుంది. సరిగ్గా ఇలాంటి డొంక దోవలో ఓ కేటుగాడు ఏకంగా కోటి రూపాయల విలువైన వెండి బిస్కట్లను రవాణా చేస్తూ పోలీసు కంట పడ్డాడు..

అబ్బో.. వీడెవడో పుష్పకి గురువుగారిలా ఉన్నాడే!.. నోరెళ్లబెట్టిన పోలీసులు
Secret Chamber Inside Mahindra Scorpio

Updated on: Jul 11, 2025 | 11:26 AM

భువనేశ్వర్, జులై 11: స్మగ్లింగ్‌ పేరు వినిపించగానే దాదాపు అందరిలో మనసులో మెదిలేది అల్లు అర్జున్‌ మువీ ‘పుష్ప’. ఈ మువీలో పోలీసుల కళ్లు గప్పి పుష్ప కోట్ల విలువైన స్మగ్లింగ్‌ గూడ్స్ అవలీలగా టార్గెట్ పాయింట్‌కు చేర్చడం చూపరులకు కాస్త విస్మయానికి గురి చేస్తుంది. సరిగ్గా ఇలాంటి డొంక దోవలో ఓ కేటుగాడు ఏకంగా కోటి రూపాయల విలువైన వెండి బిస్కట్లను రవాణా చేస్తూ పోలీసు కంట పడ్డాడు. అతడి స్కెచ్‌కు పోలీసులు సైతం పరేషానయ్యారు. ఈ సంఘటన ఒరిస్సాలోని సంభాల్‌పూర్‌ జిల్లాలో వెలుగులోకి వచ్చింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం..

ఒడిశాలోని సంబల్‌పూర్‌ జిల్లా రెంగాలిలో మహీంద్రా స్కార్పియో వాహనం రోడ్డుపై వెళ్తుండగా ఆబ్కారీ అధికారులు అడ్డగించారు. మహారాష్ట్రలో రిజిస్టర్ చేయబడిన స్కార్పియో వాహనం అది. వాహనం లోపల అధికారులు తనిఖీ చేయగా.. వెనుక సీటు కింద ఓ సీక్రెట్‌ ఛాంబర్‌ కనిపించింది. అందులో ఏకంగా 100 కిలోలకుపైగా బరువున్న వెండి బిస్కట్లు కనిపించాయి. వీటి ధర రూ. 1 కోటి కంటే ఎక్కువ ఉంటుందని అధికారులు అంచనా వేశారు. వెండి బిస్కట్లు మొత్తం 110 వరకు ఉన్నాయి. ఒక్కో బిస్కెట్‌ కిలో బరువు తూగుతుంది. వెండికి సరైన పత్రాలు డ్రైవర్ చూపకపోవడంతో అధికారులు సీజ్ చేశారు. వెంటనే అధికారులు వెండిని స్వాధీనం చేసుకున్నారు. వాహనంలోని డ్రైవర్‌తో సహా ఇద్దరు వ్యక్తులను అదుపులోకి తీసుకున్నారు.

ఒడిశాలోని సంభాల్‌పూర్‌లోని రెంగలి తహసీల్ కార్యాలయం సమీపంలో ఎక్సైజ్ శాఖ ఈ కారును పట్టుకుంది. రాయ్‌పూర్ నుంచి రాంచీకి ఈ వెండిని తరలిస్తున్నట్లు డ్రైవర్ చెప్పాడు. ఎక్సైజ్ శాఖ బృందం గంజాయి అక్రమ రవాణాపై సాధారణ తనిఖీలలో భాగంగా ఇంత పెద్ద మొత్తంలో వెండి పట్టుబడింది. ఇంత రహస్యంగా రవాణా చేస్తున్న వెండి ఎక్కడి నుంచి వచ్చింది.. ఎక్కడికి తరలిస్తున్నారు అనే దానిపై దర్యాప్తు చేపట్టినట్లు జిల్లా ఆబ్కారీ సూపరింటెండెంట్‌ అసిత్‌ మల్లిక్‌ తెలిపారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి.