Viral Video: నడిరోడ్డుపై పాము, ముంగిస బీకర యుద్దం.. ఆశ్చర్యంగా తిలకిస్తున్న వాహనదారులు.. ఏది గెలిచిందంటే?

జంతువులకు సంబంధించిన వీడియోలో సోషల్‌ మీడియాలో తరచూ వైరల్‌గా మారుతుంటాయి. ఇవి ఎప్పికప్పుడూ జనాలను ఆశ్చర్యానికి గురిచేయడంతో పాటు భయాన్ని కలిగిస్తాయి. తాజాగా అలాంటి వీడియో ఒకటి సోషల్‌ మీడియాలో ట్రెండింగ్‌లోకి వచ్చింది. నడిరోడ్డుపై వెళ్తున్న ఒక నాగుపాముపై ముంగిస దాడి చేసేందుకు ప్రయత్నించగా గమనించిన స్థానికి రాళ్లతో దాని దూరంగా తరిమి పామును కాపాడురు.

Viral Video: నడిరోడ్డుపై పాము, ముంగిస బీకర యుద్దం.. ఆశ్చర్యంగా తిలకిస్తున్న వాహనదారులు.. ఏది గెలిచిందంటే?
Viral Video (2)

Updated on: Oct 26, 2025 | 8:16 PM

నడిరోడ్డుపై వెళ్తున్న ఒక నాగుపామును ముంగిస దాడి చేసేందుకు ప్రయత్నించిన ఒక వీడియో ప్రస్తుతం సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది. ఈ ఘటన రాజస్థాన్‌లోని పిపాల్‌ఖంట్ గ్రామంలోని ఒక రహదారిపై వెలుగు చూసింది. వైరల్‌ వీడియో ప్రకారం.. ఖాళీ రోడ్డుపై ఒక నాగుపాము తన పడగను విప్పుకొని బుసలు కొడుతూ ముందుకు వెళ్తుంది.. ఆ పక్కనే పొదల్లో ఉన్న ఒక ముంగీస ఆ పామును గమనించి దానిపై దాడి చేసేందుకు ఒక్కసారిగా పాము వద్దకు దూసుకొచ్చింది. రోడ్డుపై పాము, ముంగిసను చూసిన వాహనదారులు వెంటనే వాహనాలను ఆపేశారు.

ఇంతలో ఆ ముంగీస పాముపై దాడి చేయడానికి ప్రయత్నించింది. అది గమనించిన జనాలు గట్టిగా కేకలు వేస్తూ.. పామును రక్షించే ప్రయత్నం చేశారు. మరికొందరు రాళ్లతో ముంగీసను దూరంగా వెళ్లగొట్టారు. దీంతో ఆ పాము మెళ్లగా అక్కడి నుంచి పొదల్లోకి వెళ్లిపోయింది. ఈ ఆశ్చర్యకర దృశ్యాలను అక్కడున్న స్థానికులు తమ సెల్‌ఫోన్‌లో రికార్డ్ చేసి సోషల్‌ మీడియాలో అప్‌లోడ్‌ చేశారు. దీంతో ఈ వీడియో ప్రస్తుతం ట్రెండింగ్‌లోకి వచ్చింది.

ఈ వీడియో చూసిన నెటిజన్లు అందరూ తమదైన రీతిలో కామెంట్ బాక్స్‌లను నింపేస్తున్నారు. కొద్ది సమయం ఆగి ఉంటే పాము ముంగీస మధ్య బీకర యుద్దాన్ని చూసేవాళ్లమని.. వారు మంచి సీన్‌ మిస్‌ చేశారని ఒక యూజర్ కామెంట్స్ చేశాడు. నాగ దేవత ప్రాణాలు కాపాడిన ప్రతి ఒక్కరికీ ధన్యవాధాలు అని మరో యూజర్ కామెంట్ చేశారు. ఇలా ఒక్కొక్కరూ ఒక్కోలా తమ అభిప్రాయాలను కామెంట్స్‌ రూపంలో తెలియజేశారు.

వీడియో చూడండి..


మరిన్ని ట్రెండింగ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.