పెళ్లైన పది రోజులకే భర్తను హత్య చేయించిన భార్య! కారణం తెలిస్తే ఛీ అంటారు

|

Mar 27, 2025 | 10:44 AM

ఉత్తరప్రదేశ్‌లోని ఔరయ్య జిల్లాలో 15 రోజుల క్రితం పెళ్లైన దిలీప్ యాదవ్ అనే యువకుడిని అతని భార్య ప్రగతి, ఆమె ప్రేమికుడు అనురాగ్ కలిసి కాంట్రాక్ట్ కిల్లర్ ద్వారా హత్య చేయించారు. రూ.2 లక్షల సుపారీ ఇచ్చి దిలీప్‌ను చంపించారు. పోలీసుల దర్యాప్తులో ఈ షాకింగ్ విషయం వెలుగులోకి వచ్చింది. ప్రగతి, అనురాగ్‌, కాంట్రాక్ట్ కిల్లర్ అరెస్టు అయ్యారు.

పెళ్లైన పది రోజులకే భర్తను హత్య చేయించిన భార్య! కారణం తెలిస్తే ఛీ అంటారు
Up Crime
Follow us on

మీరట్ హత్య కేసు దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించింది. అది మరవక ముందు ఉత్తరప్రదేశ్‌లోని ఔరయ్య జిల్లాలో మరో దారుణ ఘటన వెలుగులోకి వచ్చింది. వివాహం అయిన 15 రోజులకే, 25 ఏళ్ల వ్యక్తిని అతని భార్య, ఆమె ప్రేమికుడు కలిసి ఓ కాంట్రాక్ట్ కిల్లర్‌తో హత్య చేయించారు. అందుకోసం అతనికి రూ.2 లక్షల సుపారీ కూడా ఇచ్చారు. ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి. మార్చి 19న ఒక పొలంలో గాయపడిన వ్యక్తి ఉన్నట్లు పోలీసులకు సమాచారం అందిందని, దీంతో అక్కడికి వెళ్లిన పోలీసులు అతన్ని బిధునాలోని కమ్యూనిటీ హెల్త్ సెంటర్‌కు తీసుకెళ్లారు. ఈ విషయాన్ని అతని కుటుంబ సభ్యులకు తెలియజేశారు.

బాధితుడు దిలీప్ యాదవ్‌ పరిస్థితి విషమించడంతో సైఫాయి ఆసుపత్రికి, తరువాత మధ్యప్రదేశ్‌లోని గ్వాలియర్‌కు, ఆపై ఆగ్రాకు తరలించారు. చికిత్స పొందుతూ అతను మార్చి 21 రాత్రి మరణించాడు. అయితే మృతుడు దిలీప్‌కి పదిహేను రోజలు కిందటే వివాహం అయింది. ఇంతలో అతనిపై ఎవరు దాడి చేశారు? ఎందుకు దాడి చేశారనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తే.. విస్తుపోయే నిజాలు వెలుగు చూశాయి. మార్చి 5, 2025న దిలీప్‌కి, ప్రగతి అనే అమ్మాయితో పెద్దల సంక్షమలో ఘనంగా వివాహం అయింది. దిలీప్ హైడ్రా డ్రైవర్‌గా పనిచేస్తున్నాడు. అయితే, పెళ్లికి ముందే ప్రగతి తన గ్రామానికి చెందిన అనురాగ్ అలియాస్ బబ్లు అలియాస్ మనోజ్ యాదవ్‌తో లవ్‌లో ఉంది.

పెళ్లి తర్వాత కూడా అతన్ని మర్చిపోలేక.. అతనితో వివాహేతర సంబంధం కొనసాగించింది. ఈ విషయం దిలీప్‌కు తెలియడంతో ఇద్దరి మధ్య విభేదాలు తలెత్తాయి. అయితే దిలీప్ ధనవంతుడని, అతని అడ్డు తొలగించుకుంటే అతని ఆస్తితో తాము కలిసి హ్యాపీగా జీవితాన్ని గడపవచ్చని ప్రగతి అనురాగ్‌తో చెప్పింది. దీంతో ఆమె మాటలు గుడ్డిగా విన్న అనురాగ్‌, దిలీప్‌ను హత్య చేయాలని ప్లాన్‌ చేశాడు. అందుకోసం కాంట్రాక్ట్ కిల్లర్ రాంజీ చువారీకి రూ.2 లక్షల సుపారీ ఇచ్చి దిలీప్‌ను హత్య చేయాలని చెప్పారు.

డబ్బు తీసుకున్న తర్వాత రాంజీ.. దిలీప్‌ను ఒక నిర్మానుష్య ప్రాంతానికి తీసుకెళ్లి అతనిపై తన వద్ద ఉన్న పిస్టల్‌తో కాల్పులు జరిపాడు. అతను చనిపోయాడు అనుకొని అక్కడి నుంచి పారిపోయాడు. కానీ, కొన ఊపరితో ఉన్న దిలీప్‌ను గమనించిన అటుగా వెళ్తున్న వాళ్లు పోలీసులకు సమాచారం అందించారు. అయితే.. ఈ కేసును ఛాలెంజ్‌గా తీసుకున్న పోలీసులు సీసీ టీవీ ఫుటేజ్ ఆధారంగా రాంజీని ముందుగా అరెస్ట్‌ చేశారు. అతన్ని వాళ్ల స్టైల్లో విచారించడంతో అసలు నిందితురాలు అతని భార్య అనే విషయం బయటపడింది. దీంతో.. మృతుడి భార్య ప్రగతి, అతని ప్రియుడు అనురాగ్‌ను అదుపులోకి తీసుకున్నారు.

మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.