బీజేపీ నేతపై ఇంకు పోసిన ఘటనపై కేసు నమోదు.. 17 మంది శివసేన కార్యకర్తల అరెస్ట్..

|

Feb 08, 2021 | 2:19 PM

Shiv Sena vs BJP: మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఉద్దవ్ ఠాక్రేపై విమర్శలు చేశాడనే కారణంతో శివసేన పార్టీ నేతలు ఓ బీజేపీ నాయకుడిపై ఇంక్ పోసి.. బలవంతంగా చీర కట్టే ప్రయత్నం..

బీజేపీ నేతపై ఇంకు పోసిన ఘటనపై కేసు నమోదు.. 17 మంది శివసేన కార్యకర్తల అరెస్ట్..
Follow us on

Shiv Sena vs BJP: మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఉద్దవ్ ఠాక్రేపై విమర్శలు చేశాడనే కారణంతో శివసేన పార్టీ నేతలు ఓ బీజేపీ నాయకుడిపై ఇంక్ పోసి.. బలవంతంగా చీర కట్టే ప్రయత్నం చేసిన సంగతి తెలిసిందే. మహారాష్ట్రలోని సోలాపూర్‌ ప్రాంతంలో ఆదివారం చోటు చేసుకున్న ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. ఈ ఘటనలో 17మందిపై కేసు నమోదు చేసి అరెస్టు చేసినట్లు సోలాపూర్ పోలీసులు వెల్లడించారు.
ఈ సంఘటన జరిగిన అనంతరం దీనికి సంబంధించిన వీడియో సోషల్: మీడియాలో వైరల్ అయ్యింది. అనంతరం బీజేపీ శ్రేణులు.. ప్రశ్నిస్తే దాడులు చేస్తారా అంటూ బహిరంగంగా ఆందోళన వ్యక్తంచేశారు. ఈ నేపథ్యంలో పోలీసులు కేసు నమోదు చేసిన నిందితులను అరెస్టు చేశారు.

Also Read:

Farm Laws: కనీస మద్దతు ధర ఎప్పుడూ ఉంటుంది.. రైతులు ఉద్యమాన్ని వీడి చర్చకు రావాలి: ప్రధాని మోదీ

రైతుల నిరసనలపై ‘విదేశీ జోక్యం’, రాజ్యసభలో ప్రధాని మోదీ సెటైర్లు, ఎఫ్ డీ ఐ కి ‘కొత్త నిర్వచనం’