అత్యంత శోచనీయం, యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్ పై రాహుల్ గాంధీ ధ్వజం

| Edited By: Pardhasaradhi Peri

Oct 11, 2020 | 10:59 AM

హత్రాస్ ఘటనలో అసలు అత్యాచారమే జరగలేదని యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్, ఆ రాష్ట్ర పోలీసులు చెప్పడాన్ని కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ ఖండించారు. ఇది అత్యంత శోచనీయమన్నారు. ఈ దేశంలో అనేకమంది ప్రజలు దళితులను, ముస్లిములను, గిరిజనులను మనుషులుగా చూడరని ఆయన ట్వీట్ చేశారు. ఈ ముఖ్యమంత్రి (యోగి ఆదిత్యనాథ్) పోలీసులు కూడా ఎవరిమీదా అత్యాచారం జరగలేదంటున్నారని, అంటే బాధితురాలిని వారు వ్యక్తిగా పరిగణించడం లేదని రాహుల్ పేర్కొన్నారు. హత్రాస్ ఘటనపై దేశమంతా అట్టుడికితే వీళ్ళు […]

అత్యంత శోచనీయం, యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్ పై రాహుల్ గాంధీ ధ్వజం
Follow us on

హత్రాస్ ఘటనలో అసలు అత్యాచారమే జరగలేదని యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్, ఆ రాష్ట్ర పోలీసులు చెప్పడాన్ని కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ ఖండించారు. ఇది అత్యంత శోచనీయమన్నారు. ఈ దేశంలో అనేకమంది ప్రజలు దళితులను, ముస్లిములను, గిరిజనులను మనుషులుగా చూడరని ఆయన ట్వీట్ చేశారు. ఈ ముఖ్యమంత్రి (యోగి ఆదిత్యనాథ్) పోలీసులు కూడా ఎవరిమీదా అత్యాచారం జరగలేదంటున్నారని, అంటే బాధితురాలిని వారు వ్యక్తిగా పరిగణించడం లేదని రాహుల్ పేర్కొన్నారు. హత్రాస్ ఘటనపై దేశమంతా అట్టుడికితే వీళ్ళు మాత్రం తమకేమీ పట్టనట్టు వ్యవహరిస్తున్నారని ఆయన ఆరోపించారు. గతవారం రాహుల్ హత్రాస్ కుటుంబాన్ని పరామర్శించారు.