Accident: లద్దాఖ్ లో ఘోర ప్రమాదం.. నదిలో పడిన బస్సు.. ఏడుగురు జవాన్లు దుర్మరణం

|

May 27, 2022 | 8:16 PM

జమ్మూకశ్మీర్ లోని లద్దాఖ్(Ladakh) లో ఘోర ప్రమాదం జరిగింది. 26 మంది జవాన్లతో వెళ్తున్న బస్సు.. అదుపుతప్పి నదిలో పడిపోయింది. తుర్తుక్ సెక్టార్ వద్ద ఈ దుర్ఘటన జరిగింది. ఈ ఘటనలో...

Accident: లద్దాఖ్ లో ఘోర ప్రమాదం.. నదిలో పడిన బస్సు.. ఏడుగురు జవాన్లు దుర్మరణం
Ladakh
Follow us on

జమ్మూకశ్మీర్ లోని లద్దాఖ్(Ladakh) లో ఘోర ప్రమాదం జరిగింది. 26 మంది జవాన్లతో వెళ్తున్న బస్సు.. అదుపుతప్పి నదిలో పడిపోయింది. తుర్తుక్ సెక్టార్ వద్ద ఈ దుర్ఘటన జరిగింది. ఈ ఘటనలో ఏడుగురు సైనికులు ప్రాణాలు కోల్పాయారు. మరికొందరికి తీవ్రగాయాలయ్యాయి. చికిత్స కోసం వారిని పార్తాపూర్‌లోని 403 ఫీల్డ్ హాస్పిటల్‌కు తరలించారు. వాహనం దాదాపు 50-60 అడుగుల లోతులో పడిపోయింది. 26 మంది సైనికులతో కూడిన బృందం పార్తాపూర్‌లోని ట్రాన్సిట్ క్యాంప్ నుంచి సబ్ సెక్టార్ హనీఫ్‌ కు వెళ్తోంది. బస్సు వెళ్తున్న సమయంలో ప్రమాదవశాత్తు అదుపుతప్పి రోడ్డుపై నుండి జారి షియోక్ నదిలో పడిపోయింది. దీంతో ఈ ఘోరం జరిగినట్లు ఆర్మీ అధికారులు తెలిపారు. గాయపడిన వారికి అత్యుత్తమ వైద్య సంరక్షణ అందించడానికి ప్రయత్నాలు జరుగుతున్నాయి. మరింత తీవ్రమైన ప్రాణనష్టాలను నివారించేందుకు వైమానిక దళం సహాయం కోరామని ఆర్మీ అధికారులు తెలిపారు.

మరిన్ని క్రైమ్ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి