వలస కార్మికులు వెళ్తున్న బస్సుకు ప్రమాదం

| Edited By:

May 30, 2020 | 2:13 PM

దేశ వ్యాప్తంగా లాక్‌డౌన్ కొనసాగుతుండటంతో.. వలస కార్మికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. వీరంతా స్వరాష్ట్రాలకు వెళ్లేందుకు అష్టకష్టాలను ఎదుర్కొంటున్నారు. ఇప్పటికే ఎంతో మంది కాలిబాటన వారివారి స్వస్థలాలకు బయల్దేరగా.. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు.. శ్రామిక్ ట్రైన్ల ద్వారా వారిని సొంత రాష్ట్రాలకు చేర్చుతోంది. ఇక మరికొన్ని చోట్ల.. ప్రత్యేక బస్సులను ఏర్పాటుచేసి తరలిస్తున్నారు. ఈ క్రమంలో అనేక చోట్ల వారు వెళ్తున్న వాహనాలు ప్రమాదాలకు గురవుతున్నాయి. తాజాగా శనివారం ఉదయం కేరళ నుంచి వెస్ట్ బెంగాల్‌ వెళ్తున్న […]

వలస కార్మికులు వెళ్తున్న బస్సుకు ప్రమాదం
Follow us on

దేశ వ్యాప్తంగా లాక్‌డౌన్ కొనసాగుతుండటంతో.. వలస కార్మికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. వీరంతా స్వరాష్ట్రాలకు వెళ్లేందుకు అష్టకష్టాలను ఎదుర్కొంటున్నారు. ఇప్పటికే ఎంతో మంది కాలిబాటన వారివారి స్వస్థలాలకు బయల్దేరగా.. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు.. శ్రామిక్ ట్రైన్ల ద్వారా వారిని సొంత రాష్ట్రాలకు చేర్చుతోంది. ఇక మరికొన్ని చోట్ల.. ప్రత్యేక బస్సులను ఏర్పాటుచేసి తరలిస్తున్నారు. ఈ క్రమంలో అనేక చోట్ల వారు వెళ్తున్న వాహనాలు ప్రమాదాలకు గురవుతున్నాయి. తాజాగా శనివారం ఉదయం కేరళ నుంచి వెస్ట్ బెంగాల్‌ వెళ్తున్న ఓ బస్సు.. ఒడిషా రాష్ట్రంలోని బాలాసోర్ ప్రాంతంలో అదుపుతప్పి పడిపోయింది. ఈ ఘటనలో ఏడుగురు గాయాలపాలయ్యారు. సమాచారం అందుకున్న వెంటనే రెస్క్యూ టీం, పోలీసులు సంఘటనాస్థలికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. క్షతగాత్రులను స్థానిక ఆస్పత్రికి తరలించారు.