Serum Institute inks deal with gates foundation: పుణెకు చెందిన సీరం ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఇండియా (ఎస్‌ఐఐ) మరో కీలక ఒప్పందం కుదుర్చుకుంది. గవి (ది వ్యాక్సిన్ అలయన్స్), బిల్ అండ్ మిలిందా గేట్స్ ఫౌండేషన్‌తో కలిసి అతి తక్కువ ధరకు కరోనా వ్యాక్సిన్‌ను అందుబాటులోకి తీసుకురానుంది. ఈ డీల్ ప్రకారం వ్యాక్సిన్ కోసం గేట్స్ ఫౌండేషన్ నుంచి గవి ద్వారా 150 మిలియన్ డాలర్ల నిధులు సీరంకు అందనున్నాయి. ఈ నేపథ్యంలో 10 కోట్ల మోతాదులో కరోనా వ్యాక్సిన్‌లను తయారీ చేయనున్నామని సీరం తెలిపింది. ఈ వ్యాక్సిన్ ధర(ఒక్కో డోస్‌కి) గరిష్టంగా 3 డాలర్లు (దాదాపు 225 రూపాయలు) ఉంటుందని వివరించింది. ఈ వ్యాక్సిన్‌ని 92 దేశాల్లో గవికి చెందిన కోవ్యాక్స్ అడ్వాన్స్ మార్కెట్ కమిట్‌మెంట్ (ఏఎంసీ)లో అందుబాటులోకి తీసుకురానున్నట్టు ప్రకటించింది. 2021 చివరి నాటికి కోట్లాడి వ్యాక్సిన్లను అందించడమే తమ ప్రధాన లక్ష్యమని సీరమ్ ఓ ప్రకటనలో తెలిపింది.
ఇక దీనిపై ట్వీట్ వేసిన ఎస్‌ఐఐ సీఈఓ అధమ్ పునావల్లా.. రిస్క్‌ని పంచుకుంటూ 100 మిలియన్ డోస్‌ల కరోనా వ్యాక్సిన్‌ను తయారు చేయడంలో భాగంగా మాతో భాగమైనందుకు బిల్‌గేట్స్, గేట్స్ ఫౌండేషన్, గావిసేత్‌కు ధన్యావాదాలు. అతి తక్కువ ధరలో ప్రపంచంలోని వెనుకబడిన దేశాలకు ఈ వ్యాక్సిన్ పంపిణీని వేగవంతం చేసేందుకు ప్రయత్నిస్తున్నాము అని కామెంట్ పెట్టారు. వకాగా అమెరికాకు చెందిన నోవావాక్స్, ఆక్స్‌ఫర్డ్-అస్టాజెనెకా కంపెనీలతో సైతం సీరం ఢీల్ కుదుర్చుకున్న విషయం తెలిసిందే.
Read This Story Also: థ్రిల్లర్ మూవీ సీక్వెల్‌లో.. శ్రీదేవీ పాత్రలో కీర్తి!
I would like to thank @BillGates, @gatesfoundation, @GaviSeth for this key partnership of risk sharing and manufacturing of a 100 million doses, which will also ensure equitable access at an affordable price to many countries around the world. https://t.co/NDmpo23Ay8 pic.twitter.com/jNaNh6xUPy
— Adar Poonawalla (@adarpoonawalla) August 7, 2020