Budget 2021 – Sensex, Nifty: కేంద్ర ఆర్థికశాఖ మంత్రి నిర్మలా సీతారామన్ సోమవారం 2021-22 బడ్జెట్‌ను ప్రవేశపెట్టిన అనంతరం స్టాక్ మార్కెట్లు దూసుకుపోతున్నాయి. గతకొంతకాలం నుంచి భారీ పతనాన్ని చవిసూసిన స్టాక్ మార్కెట్లు మళ్లీ పుంజుకొని లాభాల బాట పట్టాయి. బడ్జెట్-2021లో ప్రకటించిన ఊద్దీపనల కారణంగా స్టాక్ మార్కెట్లల్లో ఉత్సాహం నెలకొంది. దీంతో సెన్సెక్స్ 1,700 పాయింట్లకు పెరగగా.. నిఫ్టీ 14,000ల పాయింట్లకు చేరింది.
మదుపర్లు షేర్లు కోనుగోలు చేసేందుకు విపరీతంగా ఆసక్తి చూడంతో సెన్సెక్స్ ఒక్కసారిగా భారీగా పెరిగింది. ఏకంగా 1660.99 పాయింట్లు పెరగి 47,946.76కు చేరుకుంది. ఇక నిఫ్టీ కూడా 462.15 పాయింట్లు పెరగి 14,096.75కు చేరుకుంది. అంతేకాకుండా సెన్సెక్స్ చార్టులో.. ఇండస్ఇండ్ బ్యాంక్ 11 శాతానికి పైగా పెరిగింది. బ్యాంకింగ్ రంగాలన్నీ ఆశాజనకంగానే ముందుకు సాగుతున్నాయి. దీనికి ఆర్థికపరమైన అంశాలే కారణమని నిపుణులు అభిప్రాయపడుతున్నారు.
Also Read: