సుప్రీంకోర్టుకు చేరిన ‘ మహా ‘ రాజకీయం

| Edited By: Ram Naramaneni

Nov 12, 2019 | 4:50 PM

మహారాష్ట్రలో రాష్ట్రపతి పాలన విధించాలని గవర్నర్ భగత్ సింగ్ కోష్యారీ చేసిన సిఫారసును కేంద్ర కేబినెట్ ఆమోదించడంతో శివసేన భగ్గుమంది. సేన చీఫ్ ఉధ్ధవ్ థాక్రే వెంటనే ప్రముఖ న్యాయవాది కపిల్ సిబల్ ను సంప్రదించారు. గవర్నర్ నిర్ణయాన్ని సవాల్ చేస్తూ సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. గవర్నర్ బీజేపీ సూచనపై వ్యవహరిస్తున్నారని, ఆయనది తొందరపాటు చర్య అని సేన తన పిటిషన్ లో పేర్కొంది. బీజేపీకి 48 గంటల గడువు ఇఛ్చి.. మాకు మాత్రం 24 […]

సుప్రీంకోర్టుకు చేరిన  మహా  రాజకీయం
Follow us on

మహారాష్ట్రలో రాష్ట్రపతి పాలన విధించాలని గవర్నర్ భగత్ సింగ్ కోష్యారీ చేసిన సిఫారసును కేంద్ర కేబినెట్ ఆమోదించడంతో శివసేన భగ్గుమంది. సేన చీఫ్ ఉధ్ధవ్ థాక్రే వెంటనే ప్రముఖ న్యాయవాది కపిల్ సిబల్ ను సంప్రదించారు. గవర్నర్ నిర్ణయాన్ని సవాల్ చేస్తూ సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. గవర్నర్ బీజేపీ సూచనపై వ్యవహరిస్తున్నారని, ఆయనది తొందరపాటు చర్య అని సేన తన పిటిషన్ లో పేర్కొంది. బీజేపీకి 48 గంటల గడువు ఇఛ్చి.. మాకు మాత్రం 24 గంటల సమయమే ఇస్తారా అని సేన ప్రశ్నించింది. తమ పిటిషన్ పై తక్షణమే విచారణ జరపాలని కోర్టును అభ్యర్థించింది. కాగా- గవర్నర్ నిన్న ఎన్సీపీకి ఈ రాత్రి ఎనిమిదిన్నర గంటల వరకు గడువు ఇచ్చిన సంగతి తెలిసిందే. ఈ లోగా తాము కాంగ్రెస్ నేతలతో సంప్రదించి.. తమకు మద్దతునిస్తున్న ఎమ్మెల్యేల జాబితాను సమర్పిస్తామని ఎన్సీపీ ఆయనకు తెలిపింది. అయితే ఈ లోగానే గవర్నర్.. రాష్ట్రంలో రాష్ట్రపతి పాలన విధించాలంటూ కేంద్రానికి సిఫారసు చేశారు.

అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు ప్రకటించి 20 రోజులైనప్పటికీ రాష్ట్రంలో రాజకీయ అనిశ్చితి కొనసాగుతోందని, ఏ పార్టీ కూడా తమకు మద్దతునిస్తున్న సభ్యుల జాబితానుసమర్పించలేకపోయిందని గవర్నర్ తన లేఖలో పేర్కొన్నారు. అసెంబ్లీ కాల పరిమితి ఈ నెల 9 తో ముగిసింది. దీంతో ప్రధాన పార్టీల మధ్య చర్చలు కొనసాగుతూ వచ్చినా బీజేపీ సహా ఏ పార్టీ కూడా స్పష్టమైన మద్దతు తమకు ఉందంటూ గవర్నర్ వద్ద నిరూపించలేకపోయాయి.ప్రభుత్వ ఏర్పాటుకు తమకు మద్దతు ఇచ్ఛే… అవసరమైనంత మంది ఎమ్మెల్యేల పేర్లను సైతం ఇవ్వలేకపోయాయి.