Schools Closed: ఆ విద్యార్థులకు గుడ్‌న్యూస్‌.. పాఠశాలల సెలవులు పొడిగింపు.. ప్రభుత్వం కీలక ఉత్తర్వులు!

Schools Closed: చలి వాతావరణం చిన్న పిల్లలపై జలుబు, జ్వరాలు, ఇతర ఇన్ఫెక్షన్లు వంటి ప్రతికూల ఆరోగ్య ప్రభావాలను చూపుతుంది. ఫలితంగా అనేక రాష్ట్రాల్లో పాఠశాలలు ప్రస్తుతం మూసివేశారు. మరికొన్ని రాష్ట్రాల్లో పాఠశాల సమయాలు మార్చారు. అయితే పలు రాష్ట్రాలలో పాఠశాలలు..

Schools Closed: ఆ విద్యార్థులకు గుడ్‌న్యూస్‌.. పాఠశాలల సెలవులు పొడిగింపు.. ప్రభుత్వం కీలక ఉత్తర్వులు!
School Holidays

Updated on: Jan 12, 2026 | 11:37 AM

Schools Closed: ఉత్తరప్రదేశ్‌లో పెరుగుతున్న చలి, తీవ్రమైన చలిగాలుల కారణంగా అనేక జిల్లాల్లో శీతాకాల సెలవులు పొడిగించారు. ఉత్తరప్రదేశ్‌లోని గౌతమ్ బుద్ధ నగర్ జిల్లాలో, చలి, పొగమంచు కారణంగా 8వ తరగతి వరకు ఉన్న అన్ని బోర్డులలోని పాఠశాలలను జనవరి 15వ తేదీ వరకు పొడిగిస్తున్నట్లు ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. అయితే అప్పటి వరకు చలి తీవ్రత ఎక్కువ ఉంటే మరిన్ని సెలవులు పొడిగించే అవకాశం ఉందని తెలుస్తోంది. నోయిడాలోని పాఠశాలలు జనవరి 16న తిరిగి తెరుచుకుంటాయి. అదేవిధంగా ఉత్తరప్రదేశ్‌లోని సంభాల్‌లో పాఠశాలలకు సెలవులు జనవరి 15న ముగుస్తాయి.

సంభాల్ జిల్లాలో తీవ్రమైన చలి, దట్టమైన పొగమంచు, చలిగాలుల దృష్ట్యా, జిల్లా మేజిస్ట్రేట్ డాక్టర్ రాజేంద్ర పైసియా ఇటీవల నర్సరీ నుండి 8వ తరగతి వరకు ఉన్న అన్ని విద్యా సంస్థలను జనవరి 14, 2026 వరకు మూసివేయాలని ఉత్తర్వులు జారీ చేశారు. ఔరయ్యలో, నర్సరీ నుండి 8వ తరగతి వరకు ఉన్న పాఠశాలలు కూడా 12వ తేదీ వరకు మూసివేశారు. అంటే ఇక్కడ మంగళవారం నుంచి స్కూల్స్‌ ఓపెన్‌ అవుతాయి.

ఇది కూడా చదవండి: Today Gold Rate: ఓరి దేవుడా.. పండగకు ముందు బంగారం, వెండి ధర ఇంత పెరిగిందా? షాకిచ్చిన పసిడి!

ఇవి కూడా చదవండి

ఢిల్లీలో కూడా సెలవులు పొడిగింపు:

ఇదిలా ఉంటే తీవ్రమైన చలి, దట్టమైన పొగమంచు కారణంగా, ఢిల్లీలోని పాఠశాలలు కూడా ప్రస్తుతానికి తిరిగి తెరుచుకోలేదు. నర్సరీ నుండి 8వ తరగతి వరకు పాఠశాలలు జనవరి 15 వరకు సెలవులను పొడిగించారు.. గతంలో ఈ సెలవులు జనవరి 8 వరకు ఉండేవి. పంజాబ్‌లోని పాఠశాలలు జనవరి 13 వరకు మూసివేస్తున్నట్లు ప్రకటించారు. అంటే పాఠశాలలు జనవరి 14న తిరిగి తెరుచుకుంటాయి. గతంలో సెలవులు జనవరి 7 వరకు ఉండేవి. కానీ ప్రతికూల వాతావరణం కారణంగా పొడిగించారు.

Bank Holiday: ఈ రోజు బ్యాంకులు మూసి ఉంటాయా? ఎక్కడెక్కడో తెలుసా?

చలి వాతావరణం చిన్న పిల్లలపై జలుబు, జ్వరాలు, ఇతర ఇన్ఫెక్షన్లు వంటి ప్రతికూల ఆరోగ్య ప్రభావాలను చూపుతుంది. ఫలితంగా అనేక రాష్ట్రాల్లో పాఠశాలలు ప్రస్తుతం మూసివేశారు. మరికొన్ని రాష్ట్రాల్లో పాఠశాల సమయాలు మార్చారు. ఉత్తరప్రదేశ్, హర్యానా, ఢిల్లీ, పంజాబ్‌లలో రాబోయే కొన్ని రోజులు దట్టమైన పొగమంచు, చలిగాలులు వీస్తాయని భారత వాతావరణ శాఖ హెచ్చరిక జారీ చేసింది.

Vande Bharat Sleeper: ఈ ట్రైన్‌లో వెయిటింగ్ సౌకర్యం ఉండదు.. కనీస ఛార్జ్‌ ఎంత ఉంటుందో తెలుసా?

మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి