AIADMK Party: అన్నాడీఎంకేలో శశికళను చేర్చుకునే ప్రసక్తే లేదు.. తేల్చి చెప్పిన తమిళనాడు మంత్రి

|

Jan 31, 2021 | 9:38 PM

AIADMK Party: అక్రమాస్తుల కేసులో జైలు శిక్ష పూర్తి చేసుకుని ఇటీవలే విడుదలైన శిశకళ మరికొద్ది రోజుల్లో చెన్నైలో..

AIADMK Party: అన్నాడీఎంకేలో శశికళను చేర్చుకునే ప్రసక్తే లేదు.. తేల్చి చెప్పిన తమిళనాడు మంత్రి
Follow us on

AIADMK Party: అక్రమాస్తుల కేసులో జైలు శిక్ష పూర్తి చేసుకుని ఇటీవలే విడుదలైన శిశకళ మరికొద్ది రోజుల్లో చెన్నైలో అడుగుపెట్టనున్నారు. ఈ నేపథ్యంలో అన్నాడీఎంకేలో ఆమె రాజకీయ భవితవ్యంపై పలువురు నేతలు తీవ్కరంగా స్పందిస్తున్నారు. తాజాగా శశికళను అన్నాడీఎంకేలోకి రానిస్తారా? అని ఓ మీడియా ప్రతినిధి తమిళనాడు రాష్ట్ర మంత్రి డి. జయకుమార్‌ను ప్రశ్నించగా.. ఆయన ఘాటుగా స్పందించారు. శశికళను అన్నాడీఎంకేలో చేర్చుకునే ప్రసక్తే లేదని తేల్చి చెప్పారు. అన్నాడీఎంకే కంచుకోట అని, దాన్ని ఎవరూ ఏమీ చేయలేరని ధీమా వ్యక్తం చేశారు. శశికళను తిరిగి అన్నాడీఎంకేలో చేర్చుకోవడం అనే మాటే ఉత్పన్నం కాదని ఉద్ఘాటించారు. ఆమెనే కాదు.. అమ్మా మక్కల్ మున్నెట్ర కళగం నాయకుడు దినకరన్‌ను కూడా అన్నాడీఎంకేలోకి చేర్చుకోబోమని స్పష్టం చేశారు. ఇదే సమయంలో అమ్మా మక్కల్‌ మున్నేట్ర కళగాన్ని అన్నాడీఎంకేలో విలీనం చేస్తారని జరుగుతున్న ప్రచారాన్ని సైతం ఆయన తోసిపుచ్చారు.

Also read:

ప్రభుత్వ ఉద్యోగాన్ని వదిలి పోరుబాట… రైతు ఉద్యమ నాయకుడు రాకేశ్ తికాయత్ గురించి మీకు తెలుసా…

Sai Pallavi: ‘వరుణ్‌తో నటించేప్పుడు హీల్స్‌ వేసుకునేదాన్ని’.. ఆసక్తికర విషయాలు వెల్లడించిన హైబ్రీడ్‌ పిల్ల..