ఆ దంపతులు ఆలుమగలు కాదు, మగమగలే!

| Edited By: Team Veegam

Sep 15, 2020 | 6:58 PM

వారిద్దరు ప్రేమించుకున్నారు.. ఒకరిని విడిచి ఇంకొకరు ఉండలేనంతగా బలపడింది ప్రేమ. ఇంట్లోవాళ్లను ఎదిరించి మరీ పెళ్లి చేసుకున్నారు.. 2012లో పెళ్లి జరిగింది. పెళ్లయిన రెండేళ్ల తర్వాత ఓ బాబును దత్తత తీసుకున్నారు..

ఆ దంపతులు ఆలుమగలు కాదు, మగమగలే!
Follow us on

వారిద్దరు ప్రేమించుకున్నారు.. ఒకరిని విడిచి ఇంకొకరు ఉండలేనంతగా బలపడింది ప్రేమ. ఇంట్లోవాళ్లను ఎదిరించి మరీ పెళ్లి చేసుకున్నారు.. 2012లో పెళ్లి జరిగింది. పెళ్లయిన రెండేళ్ల తర్వాత ఓ బాబును దత్తత తీసుకున్నారు.. మధ్యప్రదేశ్‌లోని సెహోర్‌ పట్టణంలో ఎనిమిదేళ్లపాటు అన్యోన్యంగా కాపురం చేశారు.. ఏమైందో ఏమోకానీ మొన్న ఆగస్టు 11న వారిద్దరి మధ్య చిన్న గొడవ జరిగింది.. కోపంతో భార్య నిప్పంటించుకుంది.. భార్యను కాపాడే ప్రయత్నంలో భర్తకు కూడా గాయాలయ్యాయి.. చుట్టుపక్కల వారు ఆలుమగలిద్దరిని భోపాల్‌ ప్రభుత్వ ఆసుప్రతిలో చేర్చారు.. 90 శాతం కాలిన గాయాలతో భార్య మరుసటి రోజు మరణించింది.. నాలుగు రోజుల తర్వాత భర్త కూడా చనిపోయాడు.
సహజ మరణాలు కావు కాబట్టి పోస్టుమార్టం చేశారు.. అప్పుడు అసలు విషయం తెలిసి ఆశ్చర్యపోయారు డాక్టర్లు.. వారు ఆలుమగలు కాదని.. మగమగలేనని అటాప్సీ రిపోర్ట్‌లో బయటపడింది.. ఇదేదో తిరకాసు కేసులా ఉందనుకున్న ఆసుపత్రి సిబ్బంది ఎందుకైనా మంచిదని పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఇద్దరూ మగవారేనని తెలుసుకున్న పోలీసులు కుటుంబసభ్యులను ప్రశ్నించారు.. ఇద్దరు మగవారేనన్న విషయం తమకు తెలియదని కుటుంబసభ్యులు చెప్పారు.. భర్తగా ఇంతకాలం చెలామణి అయిన వ్యక్తి అన్నయ్య మాత్రం తనకు తెలిసిన విషయాలను పోలీసులకు చెప్పాడు.. తన తమ్ముడు స్వలింగ సంపర్క ఉద్యమానికి మద్దతుగా పోరాటం చేసేవాడని తెలిపాడు.. ఆ ఉద్యమంలోనే ఓ గే పరిచయం అయ్యాడని, తామిద్దరం సహజీవనం చేయాలనుకుంటున్నామని కూడా చెప్పాడని అన్నాడు.. అయితే ఇంట్లో పెద్దలు ససేమిరా అనడంతో ఇల్లు వదిలి వెళ్లిపోయాడని, ఆ తర్వాత తమకు తెలియకుండానే పెళ్లి చేసుకున్నాడని చెప్పుకొచ్చాడు. వారిద్దరు స్వలింగ సంపర్కులన్నీ విషయం తమకు తెలియదని, అచ్చం భార్య భర్తల్లాగే ఉండేవారని స్థానికులు కూడా చెప్పడం విశేషం. స్వలింగ సంపర్కం నేరం కాదంటూ సుప్రీంకోర్టు 2018 సెప్టెంబర్ ఆరున చారిత్రాత్మక తీర్పు ఇచ్చింది. ఐపీసీ సెక్షన్ 377 కింద గే సెక్స్‌‌లో పాల్గొనే వారికి శిక్షలు వేయడం సరికాదని తెలిపింది.