సీఏఏ వివాదం.. మేం అధికారంలోకి వస్తే.. వారికి పింఛన్లు.. ఎస్పీ హామీ

| Edited By: Anil kumar poka

Jan 04, 2020 | 2:27 PM

పౌరసత్వ చట్టానికి నిరసనగా ఆందోళన చేసినవారికి.. తాము అధికారంలోకి వస్తే పింఛన్లు ఇస్తామని యూపీలోని  ప్రతిపక్ష సమాజ్ వాదీ పార్టీ హామీ ఇచ్చింది. అలాగే రాష్ట్రంలో ఈ చట్టానికి వ్యతిరేకంగా నిరసన తెలుపుతూ.. మరణించిన, లేదా జైలుపాలైన వారి కుటుంబాలకు పరిహారం కూడా చెల్లిస్తామని యూపీ అసెంబ్లీలో ప్రతిపక్ష నేత రామ్ గోవింద్ చౌదరి పేర్కొన్నారు. కేంద్రంలోను, ఈ రాష్ట్రంలోను మా పార్టీ అధికార పగ్గాలు చేబట్టిన పక్షంలో.. ఈ వెసులుబాటు కల్పిస్తామని ఆయన చెప్పారు. ఈ […]

సీఏఏ వివాదం.. మేం అధికారంలోకి వస్తే.. వారికి పింఛన్లు.. ఎస్పీ హామీ
Follow us on

పౌరసత్వ చట్టానికి నిరసనగా ఆందోళన చేసినవారికి.. తాము అధికారంలోకి వస్తే పింఛన్లు ఇస్తామని యూపీలోని  ప్రతిపక్ష సమాజ్ వాదీ పార్టీ హామీ ఇచ్చింది. అలాగే రాష్ట్రంలో ఈ చట్టానికి వ్యతిరేకంగా నిరసన తెలుపుతూ.. మరణించిన, లేదా జైలుపాలైన వారి కుటుంబాలకు పరిహారం కూడా చెల్లిస్తామని యూపీ అసెంబ్లీలో ప్రతిపక్ష నేత రామ్ గోవింద్ చౌదరి పేర్కొన్నారు. కేంద్రంలోను, ఈ రాష్ట్రంలోను మా పార్టీ అధికార పగ్గాలు చేబట్టిన పక్షంలో.. ఈ వెసులుబాటు కల్పిస్తామని ఆయన చెప్పారు. ఈ నిరసనకారులంతా ప్రజాస్వామ్యాన్ని, రాజ్యాంగాన్ని పరిరక్షించేందుకు కృషి చేశారని ఆయన ప్రశంసించారు. పాకిస్తాన్ లో హిందువులపై జరుగుతున్న అరాచకాలను తెలుసుకోవాలంటే సమాజ్ వాదీ పార్టీ చీఫ్ అఖిలేష్ యాదవ్ ఆ దేశంలో నెల రోజులపాటు ఉండాలన్న రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు స్వతంత్ర దేవ్ సింగ్ చేసిన వ్యాఖ్యలను ఆయన తేలిగ్గా కొట్టిపారేశారు. మోదీ ప్రభుత్వం వాస్తవ సమస్యల నుంచి ప్రజల దృష్టిని మళ్లించడానికి యత్నిస్తోందన్నారు. ‘ ఎవరు ప్రశ్నించినా వారిని పాకిస్తాన్ కు వెళ్లమంటున్నారు ‘ అని చౌదరి సెటైర్ వేశారు.

అటు-సమాజ్ వాదీ పార్టీపై యూపీ డిప్యూటీ సీఎం దినేష్ శర్మ మండిపడుతూ.. సంఘ వ్యతిరేక శక్తులను గౌరవిస్తామని చెప్పడం ఆ పార్టీ డీఎన్ఏ లోనే ఉందన్నారు. గతంలో ఉగ్రవాదులపై కేసులను ఉపసంహరింపజేసేందుకు ఆ పార్టీ యత్నించిందని, అయితే కోర్టులు జోక్యం చేసుకోవడంతో వారి ఆటలు సాగలేదని దినేష్ శర్మ అన్నారు.