పట్టిస్తే రూ.1.25 కోట్లకుపైగా రివార్డులు, మావోయిస్టు తలలకు వెలలు! ఎన్ఐఏ చేసిన తాజా ప్రకటన

|

Jun 13, 2022 | 11:38 AM

నేషనల్​ ఇన్వెస్టిగేషన్​ ఏజెన్సీ(ఎన్ఐఏ) దండకారణ్యంలోని మావోయిస్టుల తలలపై రివార్డులు ప్రకటించింది. మావోయిస్టుల ముఖ్యనేతల్లో కొందరిపై ఎన్ఐఏ భారీ రివార్డులను ప్రకటించింది.

పట్టిస్తే రూ.1.25 కోట్లకుపైగా రివార్డులు, మావోయిస్టు తలలకు వెలలు! ఎన్ఐఏ చేసిన తాజా ప్రకటన
Maoists
Follow us on

నేషనల్​ ఇన్వెస్టిగేషన్​ ఏజెన్సీ(ఎన్ఐఏ) దండకారణ్యంలోని మావోయిస్టుల తలలపై రివార్డులు ప్రకటించింది. మావోయిస్టుల ముఖ్యనేతల్లో కొందరిపై ఎన్ఐఏ భారీ రివార్డులను ప్రకటించింది. ఛత్తీస్‌గఢ్‌లో 2013లో జరిగిన జీరంఘట్టి దాడిలో ప్రమేయమున్న 21 మందిపై రూ.1.25 కోట్లకుపైగా రివార్డుల్ని ప్రకటిస్తూ ఎన్‌ఐఏ మూడు రోజుల క్రితం జాబితా విడుదల చేసింది. ఇందులో మావోయిస్టు పార్టీ కేంద్ర కమిటీ కార్యదర్శి నంబాల కేశవరావు అలియాస్‌ బస్వరాజ్‌ని పట్టిస్తే అత్యధికంగా రూ.50 లక్షలు, కమాండర్‌ హిడ్మాని పట్టిస్తే రూ.25 లక్షలు ఇస్తామని ప్రకటించింది.

కేంద్ర కమిటీ సభ్యుడు, కోరుట్లకు చెందిన తిప్పిరి తిరుపతి అలియాస్‌ దేవ్‌జీ, నల్గొండ జిల్లా చుండూరుకు చెందిన పాక హన్మంతు అలియాస్‌ ఊకే గణేశ్‌పై రూ.7 లక్షల చొప్పున, ఛత్తీస్‌గఢ్‌కు చెందిన మరో నలుగురిపై రూ.5 లక్షల చొప్పున, ముగ్గురిపై రూ.2.5 లక్షల చొప్పున, ఎనిమిది మందిపై రూ.లక్ష చొప్పున, ఇద్దరిపై రూ.50 వేల చొప్పున ప్రకటించింది. గతంలోనే బస్తర్‌ పోలీసులు తెలుగు మావోయిస్టు అగ్రనేతలు గణపతి, బస్వరాజ్‌, కటకం సుదర్శన్‌, మల్లోజుల వేణుగోపాల్‌రావుపై రూ.కోటి చొప్పున రివార్డు ప్రకటించారు. తాజాగా బస్వరాజ్‌పై ఎన్‌ఐఏ అదనంగా ఈ రివార్డు ప్రకటించింది.

మావోయిస్టులకు వ్యతిరేకంగా ఛత్తీస్‌గఢ్‌లో సల్వాజుడుంని ఏర్పాటు చేసిన కాంగ్రెస్‌ నేత మహేంద్రకర్మ లక్ష్యంగా 2013 మేలో దాడి జరిగింది. ఇందులో మహేంద్రకర్మ సహా 32 మంది మరణించారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి