యూపీ జైల్లో తనను హతమార్చేందుకు తన ప్రత్యర్థులు రూ. 5 కోట్ల కాంట్రాక్టును కుదుర్చుకున్నారని గ్యాంగ్ స్టర్, బహుజన్ సమాజ్ పార్టీ ఎమ్మెల్యే ముక్తార్ అన్సారీ తెలిపాడు. కొంతమంది అనధికారిక వ్యక్తులు రిజిస్టర్ లో ఎలాంటి ఎంట్రీ ఇవ్వకుండానే జైల్లో ప్రవేశించారని ఆయన అన్నాడు. ఉత్తరప్రదేశ్ లోని బాందా జైల్లో శిక్ష అనుభవిస్తున్న ఈయనను ..జైలు అధికారులు స్పెషల్ కోర్టులో హాజరు పరచగా ..తన హత్యకు గతంలో కూడా ప్రయత్నాలు జరిగాయన్నాడు. ఇతడిని న్యాయమూర్తి వర్చ్యువల్ గా విచారించారు. ఈయనపై లోగడ ఫోర్జరీ, ఛీటింగ్ కేసు నమోదయింది. బలవంతపు వసూళ్ల కేసులో అన్సారీని పంజాబ్ లోని రోపార్ జైలు నుంచి మొహాలీ కోర్టుకు తరలించడానికి బులెట్ ప్రూఫ్ అంబులెన్స్ ను వినియోగించారని తెలిసింది. జైల్లో తన క్లయింటును చంపేందుకు 5 కోట్ల కాంట్రాక్టును కుదుర్చుకున్నారని.. పైగా జైల్లోకి గుర్తు తెలియని వ్యక్తుల ప్రవేశానికి అనువుగా సీసీటీవీ కెమెరాల దిశలను మార్చివేశారని ఇతని తరఫు లాయర్ కోర్టుకు తెలిపారు. అన్సారీపై ఘాజీపూర్ పోలీసు స్టేషన్ లో 52 కేసులు ఉన్నాయి.
బీజేపీ ఎమ్మెల్యే కృష్ణనంద రాయ్ హత్య కేసులోనూ ప్రధాన నిందితుడిగా ఉన్నాడు. పంజాబ్ లోని రోపార్ జైల్లో రెండేళ్లు శిక్ష అనుభవించిన అన్సారీ..కేసును కోర్టు ఈ నెల 27 కి వాయిదా వేసింది. ఇతని సహచరులు లోగడ ఓ బిజినెస్ మన్ నుంచి రూ. 10 కోట్ల సొమ్మును డిమాండ్ చేశారని తెలిసింది. పలు క్రిమినల్ కేసులతో సంబంధం ఉన్న ఈ గ్యాంగ్ స్టర్ ఎమ్మెల్యేను యూపీలోని జైలుకు తరలించాలని సుప్రీంకోర్టు గత మార్చి 26 న పోలీసులను ఆదేశించింది.
మరిన్ని ఇక్కడ చూడండి : జియో సంచలనం.. రూ. 4 వేలకే స్మార్ట్ ఫోన్..!ఫీచర్స్ ఇలా .. :JIO Phone for 4k video.
ఐసీఐసీఐ బంపర్ ఆఫర్… ఐటీ రిటర్న్స్ పత్రాలు లేకపోయినా హౌస్ లోన్ గ్యారంటీ..!:ICICI Home Finance Video.