Road Accident: ఘోర రోడ్డు ప్రమాదం.. రెండు బస్సులు ఢీః.. 11 మంది మృతి, 40 మందికి గాయాలు

Road Accident: తిరుపత్తూరు ప్రాంతంలోని పిల్లయార్‌పట్టి నుండి ఐదు కిలోమీటర్ల దూరంలో ఈ ప్రమాదం జరిగింది. ప్రమాదం జరిగిన వెంటనే పోలీసులు హుటాహుటిన సంఘటన స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. బస్సుల్లో నలిగిపోయిన వారిని బయటకు తీశారు. అలాగే బస్సుల్లో..

Road Accident: ఘోర రోడ్డు ప్రమాదం.. రెండు బస్సులు ఢీః.. 11 మంది మృతి, 40 మందికి గాయాలు

Updated on: Nov 30, 2025 | 6:06 PM

Road Accident: రోజురోజుకు రోడ్డు ప్రమాదాలు పెరిగిపోతున్నాయి. ఈ ప్రమాదాల్లో ఎందరో ప్రాణాలు కోల్పోతున్నారు. ఆదివారం తమిళనాడులోని శివగంగా జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. రెండు ప్రభుత్వ బస్సులు ఎదురెదురుగా ఢీకొన్నాయి. ఈ ప్రమాదంలో 11 మంది మృతి చెందగా, 40 మంది గాయపడ్డారని పోలీసులు తెలిపారు. శివగంగా రాష్ట్ర రాజధాని చెన్నై నుండి దాదాపు 460 కి.మీ దూరంలో ఉంది.

తిరుపత్తూరు ప్రాంతంలోని పిల్లయార్‌పట్టి నుండి ఐదు కిలోమీటర్ల దూరంలో ఈ ప్రమాదం జరిగింది. ప్రమాదం జరిగిన వెంటనే పోలీసులు హుటాహుటిన సంఘటన స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. బస్సుల్లో నలిగిపోయిన వారిని బయటకు తీశారు.

ఒక బస్సు తిరుప్పూర్ నుండి కరైకుడికి వెళుతుండగా, మరొకటి కరైకుడి నుండి దిండిగల్ జిల్లా వైపు వెళుతోంది. అయితే మృతుల సంఖ్య ఇంకా పెరిగే అవకాశాలు ఉన్నట్లు తెలుస్తోంది. ప్రమాదం జరిగిన వెంటనే కొందరు మహిళలు బస్సుల్లోంచి బయటకు దూకారు.ప్రమాదంతో రహదారి రక్తసిక్తమైపోయింది.

అత్యవసర బృందాలు గాయపడిన వారిని సమీపంలోని ఆసుపత్రులకు తరలించాయి. ప్రమాదానికి గల కారణాలు, ఆసుపత్రిలో చేరిన వారి పరిస్థితిపై పోలీసులు, అధికారులు తెలుసుకుంటున్నారు.