రోడ్డు ప్రమాదాలు రోజురోజుకు పెరిగిపోతున్నాయి. అతివేగం, ఓవర్‌టెక్, మద్యం తాగి వాహనాలు నడపడం తదితర కారణాల వల్ల రోడ్డు ప్రమాదాలు జరుగుతున్నాయి. ఈ ప్రమాదాల్లో ఎంతో మంది ప్రాణాలు కోల్పోతున్నారు. తాజాగా ఉత్తరప్రదేశ్‌లో ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. భదోహిలో శుక్రవారం ట్రక్కు అదుపు తప్పి ట్రాక్టర్‌ను ఢీకొట్టింది. వేగంగా వస్తున్న లారీ అదుపు తప్పి ట్రాక్టర్‌ను వెనుక నుంచి ఢీకొట్టడంతో ట్రాక్టర్ బోల్తా పడింది. ఈ ప్రమాదంలో 10 మందికి పైగా కూలీలు మృతి చెందగా, ముగ్గురు కూలీలు గాయపడ్డారు. వారి పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం. వారిని చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు.
భదోహిలోని మహారాజ్‌గంజ్, మీర్జాపూర్‌లోని కట్కా సరిహద్దు సమీపంలో ఈ ప్రమాదం జరిగింది. ట్రాక్టర్‌లో చాలా మంది కూలీలు వెళ్తున్నారు. ఇంతలో వెనుక నుంచి వేగంగా లారీ ఢీకొట్టడంతో ఈ ప్రమాదం జరిగింది.
ప్రమాదం జరుగగానే ఒక్కసారిగా అరుపులతో దద్దరిల్లింది. దీంతో చుట్టుపక్కల వారు అక్కడికి చేరుకుని వారిని బయటకు తీశారు. క్షతగాత్రులను చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. సమాచారం అందుకున్నప్పుడు, స్థానిక పోలీసులు సంఘటన స్థలానికి చేరుకుని పరిశీలించారు. గాయపడ్డ వారికి ప్రాథమిక చికిత్స నిమిత్తం మెరుగైన వైద్యం కోసం వారణాసిలోని ట్రామా సెంటర్‌కు తరలించారు. ముగ్గురి పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది. మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం తరలించారు.
మరిన్ని క్రైమ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి