పాయల్ ఘోష్ పై రిచా ఛధ్ధా దావా ?

మీటూ ఉ ద్యమం లో భాగంగా నటి పాయల్ ఘోష్ దర్శక నిర్మాత అనురాగ్ కశ్యప్ పై ఆరోపణలు చేస్తున్న సందర్బంలో తన పేరును కూడా లాగడం పట్ల మరో నటి రిచా ఛధ్ధా ఆగ్రహం వ్యక్తం చేసింది. అసలైన బాధితురాళ్లకు న్యాయం జరగాల్సిందే అంటూనే..

పాయల్ ఘోష్ పై రిచా ఛధ్ధా దావా ?

Edited By:

Updated on: Sep 21, 2020 | 2:42 PM

మీటూ ఉ ద్యమం లో భాగంగా నటి పాయల్ ఘోష్ దర్శక నిర్మాత అనురాగ్ కశ్యప్ పై ఆరోపణలు చేస్తున్న సందర్బంలో తన పేరును కూడా లాగడం పట్ల మరో నటి రిచా ఛధ్ధా ఆగ్రహం వ్యక్తం చేసింది. అసలైన బాధితురాళ్లకు న్యాయం జరగాల్సిందే అంటూనే.. మధ్యలో తన పేరును ఎందుకు ప్రస్తావించవలసి వచ్చిందని ప్రశ్నించింది. ఈ మేరకు పాయల్ కు తన లాయర్ ద్వారా నోటీసును పంపింది. తన  క్లయింటు ప్రతిష్టను దిగజార్చే విధంగా పాయల్ ఘోష్ ప్రవర్తించిందని, ఆమెపై కోర్టుకెక్కుతామని ఆ లాయర్ పేర్కొన్నారు. మరోవైపు-అనురాగ్ కశ్యప్ పై పాయల్ పలు ఆరోపణలు చేసినప్పటికీ, ఆయనకు తాప్సీ పొన్ను, అనుభవ్ సిన్హా, రాధికా ఆప్టే , కల్కి కొచిన్ వంటి పలువురు సెలబ్రిటీలు మద్దతు పలికారు. తాప్సీ అయితే మరో ముందడుగు వేసి.. ఆయనతో తాను చేయబోయే నూతన సినీ ప్రాజెక్టు గురించి ప్రస్తావించింది.

 

Loading...
Unable to load recommendations.
Follow Us