కశ్మీర్‌లో మళ్లీ కర్ఫ్యూ..? ఇళ్లల్లోకి వెళ్లాలంటూ హెచ్చరికలు

| Edited By:

Aug 11, 2019 | 2:49 PM

శ్రీనగర్, జమ్మూ ప్రాంతాల్లో వాతావరణం ప్రశాంతంగా ఉందని రాష్ట్ర ప్రభుత్వ పోలీసులు ప్రకటించిన మరుసటి రోజే శ్రీనగర్‌లో మళ్లీ కర్ఫ్యూ విధించినట్లు తెలుస్తోంది. ఈ విషయాన్ని ఓ జాతీయ మీడియా వెల్లడించింది. బయట రోడ్లపై సంచరిస్తున్న ప్రజలంతా ఇళ్లల్లోకి వెళ్లిపోవాలంటూ పోలీసు వాహనాల నుంచి మైకుల్లో ప్రచారం చేస్తూ ప్రజలకు హెచ్చరికలు పంపుతున్నట్లు.. తమకు స్పష్టమైన సమాచారం ఉందంటూ సదరు జాతీయ మీడియా పేర్కొంది. ఆరురోజులుగా పూర్తిస్థాయిలో భారత భద్రతా బలగాల ఆధీనంలో ఉన్న ప్రాంతంలో ఎలాంటి […]

కశ్మీర్‌లో మళ్లీ కర్ఫ్యూ..? ఇళ్లల్లోకి వెళ్లాలంటూ హెచ్చరికలు
Follow us on

శ్రీనగర్, జమ్మూ ప్రాంతాల్లో వాతావరణం ప్రశాంతంగా ఉందని రాష్ట్ర ప్రభుత్వ పోలీసులు ప్రకటించిన మరుసటి రోజే శ్రీనగర్‌లో మళ్లీ కర్ఫ్యూ విధించినట్లు తెలుస్తోంది. ఈ విషయాన్ని ఓ జాతీయ మీడియా వెల్లడించింది. బయట రోడ్లపై సంచరిస్తున్న ప్రజలంతా ఇళ్లల్లోకి వెళ్లిపోవాలంటూ పోలీసు వాహనాల నుంచి మైకుల్లో ప్రచారం చేస్తూ ప్రజలకు హెచ్చరికలు పంపుతున్నట్లు.. తమకు స్పష్టమైన సమాచారం ఉందంటూ సదరు జాతీయ మీడియా పేర్కొంది.

ఆరురోజులుగా పూర్తిస్థాయిలో భారత భద్రతా బలగాల ఆధీనంలో ఉన్న ప్రాంతంలో ఎలాంటి హింసాత్మక ఘటనలు చోటు చేసుకోలేదని, జమ్మూ కశ్మీర్‌లో విధించిన కర్ఫ్యూను ఎత్తేస్తున్నట్లు ప్రభుత్వ వర్గాలు ప్రకటించాయి. వివిధ ప్రాంతాల్లో విడతల వారీగా కర్ఫ్యూని ఎత్తేస్తున్నట్లు తెలిపాయి. దీనిపై కూడా రాష్ట్ర ప్రభుత్వ పోలీసు విభాగం సమాధానం ఇచ్చింది. అయితే కర్ఫ్యూ ఎత్తేసి.. 24 గంటలు కూడా గడవకముందే ఇవాళ ఉదయమే మళ్లీ కర్ఫ్యూ విధించారని తెలుస్తోంది.