CSIR: ‘ఇక ప్రతి సోమవారం నలిగిన బట్టలు మాత్రమే ధరించండి..’ ఉద్యోగులకు సీఎస్‌ఐఆర్‌ హుకూం! ఎందుకో తెల్సా..

|

May 07, 2024 | 8:04 PM

సాధారణంగా ఉద్యోగులు ఆఫీసులకు వెళ్లేటప్పుడు నీట్‌గా ఇస్త్రీ చేసిన దుస్తులు ధరించి, టక్‌-టైతో పాలిష్‌ షూ వేసుకుని హుందాగా వెళ్తుంటారు. ఆదివారం సెలవు కావడంతో వారం బట్టలన్నీ ఉతికేసి నీట్‌గా ఇస్ట్రీ చేసుకుని తర్వాత వారం మొత్తం ధరించాల్సిన బట్టల్ని సిద్ధం చేసుకుంటారు. అయితే ఈ కంపెనీ మాత్రం తమ ఉద్యోగులను ఇస్ట్రీ బట్టలు వేసుకోవద్దని అంటోంది. బదులుగా నలిగిన బట్టలు వేసుకుని కొలువుకు రావాలని హుకుం జారీ..

CSIR: ఇక ప్రతి సోమవారం నలిగిన బట్టలు మాత్రమే ధరించండి.. ఉద్యోగులకు సీఎస్‌ఐఆర్‌ హుకూం! ఎందుకో తెల్సా..
Wrinkled Clothes
Follow us on

న్యూఢిల్లీ, మే 7: సాధారణంగా ఉద్యోగులు ఆఫీసులకు వెళ్లేటప్పుడు నీట్‌గా ఇస్త్రీ చేసిన దుస్తులు ధరించి, టక్‌-టైతో పాలిష్‌ షూ వేసుకుని హుందాగా వెళ్తుంటారు. ఆదివారం సెలవు కావడంతో వారం బట్టలన్నీ ఉతికేసి నీట్‌గా ఇస్ట్రీ చేసుకుని తర్వాత వారం మొత్తం ధరించాల్సిన బట్టల్ని సిద్ధం చేసుకుంటారు. అయితే ఈ కంపెనీ మాత్రం తమ ఉద్యోగులను ఇస్ట్రీ బట్టలు వేసుకోవద్దని అంటోంది. బదులుగా నలిగిన బట్టలు వేసుకుని కొలువుకు రావాలని హుకుం జారీ చేసింది. అదేంటీ..ఇలాంటి కంపెనీలు కూడా ఉంటాయా? అని సందేహిస్తున్నారా.. ఇదేదో అల్లాటప్ప కంపెనీ అనుకుంటే పొరబాటే! అదిపెద్ద రీసెర్చ్‌ సంస్థ కౌన్సిల్ ఆఫ్ సైంటిఫిక్ అండ్ ఇండస్ట్రియల్ రీసెర్చ్ (CSIR) ఈ రూల్‌ పాస్‌ చేసింది. దీంతో అంతా సీఎస్‌ఐఆర్‌ కొత్త రూల్‌పై గుసగులాడుకుంటున్నారు.

ఇకపై ప్రతి సోమవారం ముడతల డ్రెస్‌లు వేసుకుని ఆఫీస్‌కు రావాలని కౌన్సిల్‌ ఆఫ్ సైంటిఫిక్ అండ్ ఇండస్ట్రియల్ సెర్చ్‌ తన సిబ్బందిని కోరింది. ఇందు కోసం ప్రత్యేకంగా ‘వాహ్‌ మండేస్‌ (WAH Mondays)’ ప్రచారాన్ని ప్రారంభించింది. WAH అంటే Wrinkles Acche Hai (ముడతలు మంచివే). కాలుష్యం కారణంగా వేగంగా క్షీణిస్తున్న వాతావరణ మార్పులకు వ్యతిరేకంగా ప్రతీ సోమవారం ఇలా ఇస్త్రీ చేయని దుస్తులు ధరించి పనిచేయడమే ఈ ప్రచారం ఉద్దేశం. దీని వెనక పర్యావరణహితం ఉంది. దీనిపై సీఎస్‌ఐఆర్ తొలి మహిళా డైరెక్టర్‌ జనరల్ డాక్టర్ ఎన్‌ కళైసెల్వి మాట్లాడుతూ..

‘ఇంధన అక్షరాస్యతలో భాగంగా వాహ్‌ మండేస్‌ను తీసుకువచ్చాం.సోమవారం ఇస్త్రీ చేయని దుస్తులు ధరించి సహకరించాలని సీఎస్‌ఐఆర్‌ నిర్ణయించింది. ఒక జత దుస్తుల్ని ఐరన్ చేయడం వల్ల 200 గ్రాముల కార్బన్‌ డై ఆక్సైడ్ విడుదల అవుతుంది. ముడతల దుస్తులు ధరించడం వల్ల దానిని నివారించే అవకాశం ఉంటుందని’ ఆమె వెల్లడించారు. మే 1 నుంచి 15 వరకు ‘స్వచ్ఛతా పక్వాడా’ కార్యక్రమాన్ని నిర్వహిస్తోంది. ఇందులో భాగంగా ఇందనాన్ని ఆదా చేసేందుకు సీఎస్‌ఐఆర్‌ దేశంలోని తమ అన్ని ల్యాబ్‌లలో ఇంధన వినియోగాన్ని తగ్గించాలని లక్ష్యంగా పెట్టుకొని కొన్ని ప్రామాణిక ఆపరేటింట్‌ విధానలను అమలు చేస్తోంది. తన కార్యాలయాల్లో విద్యుత్ ఛార్జీలను 10 శాతానికి తగ్గించడం తొలి లక్ష్యంగా పెట్టుకుంది. వాటిని జూన్ నుంచి ఆగస్టు మధ్య పైలట్ ప్రాతిపదికన అమలు చేయనుంది.

ఇవి కూడా చదవండి

మరోవైపు పర్యావరణ హితం కోసం ఢిల్లీలోని రఫీ మార్గ్‌లోని CSIR ప్రధాన కార్యాలయ భవనంలో దేశంలోనే అతిపెద్ద క్లైమేట్ క్లాక్‌ (వాతావరణ గడియారం) ఏర్పాటు చేశారు. ఉద్గారాల విడుదల, పర్యావరణ మార్పు గురించి ఇది గ్రాఫ్ రూపంలో ఎప్పటికప్పుడు వెల్లడిస్తుంది. ఇది మాతృభూమి, భూ సంరక్షణ కోసం CSIR సహకారం అని డాక్టర్ కలైసెల్వి అన్నారు.

మరిన్ని జాతీయ వార్తల కోసం క్లిక్‌ చేయండి.