గంజాయ్‌ స్మగ్లర్ చేతిలో దారుణ హత్యకు గురైన టీవీ రిపోర్టర్‌

తమిళనాట దారుణం జరిగింది. గంజాయ్‌ స్మగ్లర్ల చేతిలో తమిళన్‌ టీవీ ఛానల్‌కి చెందిన రిపోర్టర్‌ మౌనస్‌ దారుణ హత్యకు గురయ్యారు.

గంజాయ్‌ స్మగ్లర్ చేతిలో దారుణ హత్యకు గురైన టీవీ రిపోర్టర్‌

Edited By:

Updated on: Nov 09, 2020 | 1:28 PM

Reporter death Tamil Nadu: తమిళనాట దారుణం జరిగింది. గంజాయ్‌ స్మగ్లర్ల చేతిలో తమిళన్‌ టీవీ ఛానల్‌కి చెందిన రిపోర్టర్‌ మౌనస్‌ దారుణ హత్యకు గురయ్యారు. అతడితో మాట్లాడాలని, కాంచీపురంలోని పుండ్రత్తూర్‌లోని ఓ ఇంటికి రమ్మని చెప్పిన గంజాయ్ స్మగ్లర్లు దారుణంగా హతమార్చారు. మౌసస్ ఒంటిపై 18చోట్ల కత్తితో పొడిచి చంపేశారు. ఇక విషయం తెలుసుకున్న పోలీసులు ముగ్గురు నిందితులను అదుపులోకి తీసుకున్నారు. (చాలా గర్వంగా ఉంది.. ఆయన ఙ్ఞాపకాలతో బ్రతికేస్తా: అమర జవాన్ ప్రవీణ్‌ రెడ్డి భార్య)

కాగా ఇటీవల స్మగ్లింగ్‌, రియల్ ఎస్టేట్ వ్యాపారుల భూకబ్జాలపై మౌనస్‌ స్టింగ్ ఆపరేషన్ చేశారు. వాటికి సంబంధించిన వరుస కథనాలను ఇటీవల ప్రసారం చేశారు. ఈ క్రమంలో మాట్లాడాలని రమ్మని చెప్పిన స్మగ్లర్లు అతడిని చంపేశారు. ఇంకెవరైనా జర్నలిస్ట్‌ స్మగ్లింగ్ వార్తలు రాస్తే ఇదే గతి అంటూ వార్నింగ్ ఇచ్చారు. ప్రస్తుతం ఈ కేసుకు సంబంధించిన దర్యాప్తు కొనసాగుతోంది. ( Flash: మెగాస్టార్ చిరంజీవికి కరోనా పాజిటివ్‌)

Loading...
Unable to load recommendations.
Follow Us