Remdesivir Injections: కరోనా పేషెంట్లకు ఇచ్చే రెమ్‌డెసివిర్ ఇంజెక్షన్లు దోపిడీకి గురయ్యాయి. దాదాపు 860 ఇంజెక్షన్లను దుండగులు దొంగిలించినట్లు అధికారులు ప్రకటించారు. ఈ ఘటన మధ్యప్రదేశ్‌లో చోటు చేసుకుంది. వివరాల్లోకెళితే.. మధ్యప్రదేశ్‌లోని హమీడియా ప్రభుత్వ ఆస్పత్రిలో 860 రెమ్‌డెసివర్ ఇంజెక్షన్లను గుర్తు తెలియని దుండగులు దొంగిలించారు. దీనిని గుర్తించిన ఆస్పత్రి వర్గాలు.. పోలీసులకు ఫిర్యాదు చేశారు. విషయం తెలుసుకున్న పోలీసులు హుటాహుటిన ఆస్పత్రికి చేరుకుని చోరీ జరిగిన ప్రదేశాన్ని పరిశీలించారు. 860 రెమ్‌డెసివిర్ ఇంజెక్షన్లు దోపిడీకి గురైనట్లు నిర్ధారించారు. దీనిపై స్పందించిన భోపాల్ డిప్యూటీ ఇన్‌స్పెక్టర్ జనర్ ఆఫ్ పోలీస్ ఇర్షాద్ వాలి.. ఈ కేసును సీరియస్‌గా తీసుకున్నామని, ఇప్పటికే కొన్ని ఆధారాలు సేకరించామన్నారు. త్వరలోనే నిందితులను పట్టుకుంటామని ప్రకటించారు. ఈ దోపిడీ వ్యవహారంలో ఆస్పత్రి సిబ్బంది ప్రమేయం ఉండొచ్చిన అనుమానం వ్యక్తం చేశారు. ఇదిలాఉంటే.. రెమ్‌డెసివిర్ ఇంజెక్షన్ల దోపిడీపై మధ్యప్రదేశ్ వైద్య,ఆరోగ్య శాఖ మంత్రి విశ్వస్ సారంగ్ రియాక్ట్ అయ్యారు. దీనిపై మీడియాతో మాట్లాడిన ఆయన.. ఇంజెక్షన్ల దోపిడీ చాలా తీవ్రమైన విషయం అని అన్నారు. ఈ ఘటనపై పోలీసు ఉన్నతాధికారులు విచారణ జరుపుతున్నారని, నిందితులు ఎవరైనా సీరియస్ యాక్షన్స్ తీసుకుంటామని స్పష్టం చేశారు. కాగా, ఈ ఘటనపై పోలీసులు ఇండియన్ పీనల్ కోడ్ సెక్షన్ 457, 380 కింద కేసు నమోదు చేశారు.
ఇదిలాఉంటే.. రెమ్‌డెసివిర్ ఇంజెక్షన్లను కోవిడ్ పేషెంట్లకు అత్యవసర సమయంలో ఉపయోగిస్తున్నారు. చాలా ప్రభావవంతంగా పనిచేస్తుండటంతో.. ఈ ఇంజెక్షన్లకు డిమాండ్ విపరీతంగా పెరిగింది. ఈ నేపథ్యంలోనే ఆస్పత్రిలో ఉన్న రెమ్‌డెసివిర్ ఇంజెక్షన్ల స్టాక్ నుంచి 860 ఇంజెక్షన్లను గుర్తు తెలియని వ్యక్తులు దొంగిలించారు. మరోవైపు మధ్యప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా కరోనా కేసులు భారీ స్థాయిలో పెరుగుతున్నాయి. దాంతో కరోనా పెషెంట్లకు ఇచ్చే రెమ్‌డెసివిర్ ఇంజెక్షన్ల కొరత భారీగా ఏర్పడింది. మరోవైపు రాష్ట్రంలో తాజాగా 11,045 కేసులు నమో అయ్యాయి. ఇప్పటి వరకు రాష్ట్రంలో ఇదే అతిపెద్ద సంఖ్య. మొత్తంగా రాష్ట్రంలో ఇప్పటి వరకు 3,84,563 మంది కరోనా బారిన పడినట్లు ఆ రాష్ట్ర వైద్యఆరోగ్యశాఖ వెల్లడించింది. ఇక మధ్యప్రదేశ్‌లో 4,425 మంది కరోనా కారణంగా ప్రాణాలు కోల్పోయారు. ఒక్క ఏప్రిల్ నెలలోనే రాష్ట్ర వ్యాప్తంకగా 89,052 కొత్త కరోనా పాజిటివ్ కేసులు నమోదు అవగా.. 439 మరణాలు నమోదు అయ్యాయి.
ANI Tweet:
Madhya Pradesh: Around 800 Remdesivir injections were allegedly stolen from Hamidia Hospital in Bhopal.
“17 boxes of Remdesivir have been stolen. One box contains 48 injections & only a few of the boxes were open. An FIR has been registered,” says ASP Ramsnehi Mishra. pic.twitter.com/DTk429R2XD
— ANI (@ANI) April 17, 2021
Also read: