
జమ్మూ కశ్మీర్‌లోని రాంభన్ జిల్లాలో ఘోర ప్రమాదం చోటు చేసుకుంది. జమ్మూ నుంచి శ్రీనగర్ వెళ్తుండగా ఆర్మీ వాహనం లోయలో పడిపోయింది. ఈ ప్రమాదంలో ముగ్గురు జవాన్లు మృతి చెందారు. పలువురు తీవ్రంగా గాయపడ్డారు. ప్రస్తుతం ప్రమాద స్థలంలో సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. పహల్గామ్ ఉగ్రదాడి తర్వాత భారత్, పాక్ మధ్య నెలకొన్న తీవ్ర ఉద్రిక్తల మధ్య సైన్యం దాడికి సిద్ధం అవుతున్న క్రమంలోనే ఈ ప్రమాదం జరిగినట్లు తెలుస్తోంది. ఈ ఘటనకు సంబంధించి మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.
మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..