ఇప్పుడు అవసరమా..? “భూమిపూజ”పై రాజ్‌ థాక్రే..!

| Edited By:

Jul 31, 2020 | 7:40 PM

రామ మందిర నిర్మాణ పనిలో భాగంగా ఆగస్టు 5వ తేదీన భూమి పూజ కార్యక్రమం జరగబోతున్న సంగతి తెలిసిందే. అయితే ఈ భూమి పూజ కార్యక్రమంపై మహారాష్ట్ర నవ నిర్మాణ్‌ సేన చీఫ్ రాజ్‌ థాక్రే..

ఇప్పుడు అవసరమా..? భూమిపూజపై రాజ్‌ థాక్రే..!
Follow us on

రామ మందిర నిర్మాణ పనిలో భాగంగా ఆగస్టు 5వ తేదీన భూమి పూజ కార్యక్రమం జరగబోతున్న సంగతి తెలిసిందే. అయితే ఈ భూమి పూజ కార్యక్రమంపై మహారాష్ట్ర నవ నిర్మాణ్‌ సేన చీఫ్ రాజ్‌ థాక్రే స్పందించారు. ప్రస్తుతం ఉన్న కరోనా సంక్షోభ కాలంలో ఈ కార్యక్రమం అవసరమా..? అంటూ భిన్న స్వరాన్ని వినిపించారు. మహారాష్ట్రకు చెందిన ఓ స్థానిక మీడియాతో మాట్లాడుతూ ఈ వ్యాఖ్యలు చేశారు. పరిస్థితి సాధారణంగా అయిన తర్వాత ఈ భూమి పూజ కార్యక్రమం పెట్టుకుంటే బాగుంటుందని అభిప్రాయపడ్డారు. మరోవైపు ఈ-భూమి పూజ (వర్చువల్) నిర్వహించాలన్న మహారాష్ట్ర సీఎం, శివసేన చీఫ్ ఉద్దవ్‌ థాక్రేపై మండిపడ్డారు. ప్రస్తుతం ప్రభుత్వాన్ని నడపడంలోనే ఉద్దవ్‌ విఫలమయ్యారని ఆరోపించారు. పూజా విధానం గురించి ఉద్దవ్‌ చెప్పాల్సిన అవసరం లేదన్నట్లుగా వ్యాఖ్యానించారు.

కాగా, ఆగస్టు 5వ తేదీన.. అయోధ్యలో జరిగే రామ మందిర నిర్మాణ భూమి పూజ కార్యక్రమానికి ప్రధాని నరేంద్ర మోదీ హాజరుకాబోతున్నారు. ఈ విషయాన్ని రామజన్మ భూమి తీర్ధ క్షేత్ర ట్రస్టు వెల్లడించింది. మొత్తం 200 మంది వరకు ఈ భూమి పూజ కార్యక్రమానికి హాజరుకానున్నారు.

Read More 

కాలుజారి నదిలో పడిపోయిన కాంగ్రెస్ ఎమ్మెల్యే

తైవాన్‌ మాజీ అధ్యక్షుడు ఇక లేరు

కల్తీ మద్యం కాటుకు నలుగురు మృతి

ఆఫ్ఘన్‌లో కారు బాంబు పేలుడు.. 8 మంది మృతి