Ayodhya Dham: రాముడికి స్వాగతం పలికేందుకు ముస్తాబైన అయోధ్య ధామ్‌.. ఆ అందం సర్వాంగ సుందరం..! వీడియో వైరల్‌

|

Dec 31, 2023 | 3:38 PM

రాముడే స్వయంగా ఇక్కడ ప్రత్యక్షమయ్యేలా.. అయోధ్యలో స్వాగత ఏర్పాట్లు జరుగుతున్నాయి. ఇక్కడి స్థానిక ప్రజలు, పర్యాటకుల్ని మంత్రముగ్దులను చేస్తోంది అయోధ్యనగరం. అయోధ్య ధామ్ గా పేరు మార్చబడిన ఇక్కడి రైల్వే స్టేషన్ అందం కూడా చూడదగ్గదే. దీనికి సంబంధించిన వీడియోను రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్ స్వయంగా షేర్‌ చేయగా..నెట్టింట తెగ సందడి చేస్తోంది.

Ayodhya Dham: రాముడికి స్వాగతం పలికేందుకు ముస్తాబైన అయోధ్య ధామ్‌.. ఆ అందం సర్వాంగ సుందరం..! వీడియో వైరల్‌
Ayodhya Dham
Follow us on

Ayodhya Dham: ఉత్తరప్రదేశ్‌లోని అయోధ్య నగరంలో జనవరి 22న అయోధ్యలో కొత్తగా నిర్మించిన రామ్‌లల్లా ఆలయ ప్రారంభోత్సవానికి సన్నాహాలు తారాస్థాయికి చేరుకున్నాయి. రామ్ లల్లా పవిత్రోత్సవానికి ముందు అయోధ్య ధామ్ గా పేరు మార్చబడిన అయోధ్య రైల్వే స్టేషన్ అందం కూడా వర్ణనాతీతంగా మారింది..రామభక్తులకు స్వాగతం పలికేందుకు అయోధ్య ధామ్‌ను సర్వంగా సుందరంగా అలంకరించారు. అయోధ్య నగరంలో ఇటీవల పునరుద్ధించిన అయోధ్య ధామ్‌ జంక్షన్‌ రంగురంగుల విద్యుత్‌ కాంతుల్లో తళుకులీనుతోంది. దీనికి సంబంధించిన వీడియోను రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్ స్వయంగా ట్వీట్ చేశారు.

రాముడే స్వయంగా ఇక్కడ ప్రత్యక్షమయ్యేలా.. అయోధ్యలో స్వాగత ఏర్పాట్లు జరుగుతున్నాయి. ఇక్కడి స్థానిక ప్రజలు, పర్యాటకుల్ని మంత్రముగ్దులను చేస్తోంది అయోధ్యనగరం. అయోధ్య ధామ్ గా పేరు మార్చబడిన ఇక్కడి రైల్వే స్టేషన్ అందం కూడా చూడదగ్గదే. దీనికి సంబంధించిన వీడియోను రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్ స్వయంగా షేర్‌ చేయగా..నెట్టింట తెగ సందడి చేస్తోంది. రైల్వే స్టేషన్లు రంగురంగుల లైట్లు, పూలతో ఎంతో అందంగా అలంకరించారు. రామభక్తులకు స్వాగతం పలికేందుకు ఎలాంటి ఢోకా లేకుండా చేసేందుకు పూర్తి స్థాయిలో సన్నాహాలు చేసినట్లు తెలుస్తోంది.

ఇవి కూడా చదవండి

ఈ వీడియో క్యాప్షన్‌లో రైల్వే మత్రి అశ్విని వైష్ణవ్ ఇలా వ్రాశారు.. ‘రఘుపతి రాఘవ రాజా రామ్! థీమ్‌తో అయోధ్య ధామం.. అలంకరించబడింది! ఈ అందమైన వీడియోపై ప్రజలు ఎంతగానో ఆకర్షితులవుతున్నారు. చాలా మంది కామెంట్లు చేస్తున్నారు. ఒక వినియోగదారు ఇలా వ్రాశారు – ఇక్కడి సన్నాహాలు చూసి, నేను ఆగలేకపోతున్నాను మేము ఖచ్చితంగా రామ్ లాలా వద్దకు వస్తాము అంటూ వ్యాఖ్యానించారు..’జై శ్రీరాం’ అంటూ నినాదాలు పోస్ట్‌ చేశారు.

ఇకపోతే, ప్రస్తుతం రాముడి అయోధ్య ఆధ్యాత్మిక కేంద్రంగా, ప్రపంచ పర్యాటక కేంద్రంగా, గొప్ప స్మార్ట్ సిటీగా అభివృద్ధి చెందుతోంది. రామ్ లల్లా మహాభిషేక కార్యక్రమాన్ని నిర్వహించే సమయంలో కేవలం 5 మంది మాత్రమే గర్భగుడిలోకి హాజరవుతారని సమాచారం.. ప్రధాని మోదీ, గవర్నర్ ఆనందీబెన్ పటేల్, ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్, సంఘ్ చీఫ్ మోహన్ భగవత్, ఆలయ ప్రధాన పూజారి ఆచార్య ఇందులో పాల్గొంటారని తెలిసింది.

ఇదిలా ఉంటే..ప్రధాని నరేంద్ర మోదీ డిసెంబర్ 30న అయోధ్య ధామ్‌ స్టేషన్‌లో 8 రైళ్లను జెండా ఊపి ప్రారంభించారు. 2 అమృత్ భారత్ మరియు 6 వందే భారత్ రైళ్లను ప్రధాని మోదీ ప్రారంభించారు. ఈ రైళ్లు దేశంలోని వివిధ మూలలను కలుపుతాయి. అయోధ్య ధామ్‌ను సందర్శించే పర్యాటకులు, యాత్రికులు, భక్తులకు ప్రీమియం ప్రయాణ అనుభవాన్ని అందిస్తాయి. అదేవిధంగా, ‘అత్యాధునిక’ సౌకర్యాలతో కూడిన ఆధునిక అయోధ్య ధామ్ రైల్వే స్టేషన్ కూడా ఆకర్షణకు కేంద్రంగా మారుతుంది. ఈ స్టేషన్‌ను మూడు దశల్లో సమగ్రంగా అభివృద్ధి చేయాల్సి ఉన్నప్పటికీ మొదటి దశ అభివృద్ధి పనులు పూర్తయ్యాయి. అలాగే, అయోధ్యధామ్ రైల్వే స్టేషన్‌తో పాటుగా మహర్షి వాల్మీకి అంతర్జాతీయ విమానాశ్రయాన్ని కూడా ఆయన ప్రారంభించారు. అంతేకాదు..ప్రధాని తన అయోధ్య పర్యటన సందర్భంగా రూ. 15,700 కోట్లకు పైగా విలువైన పలు అభివృద్ధి కార్యక్రమాలను ప్రారంభించి, శంకుస్థాపన చేశారు.

మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..