PM Garib Kalyan Yojna: తెలుగు రాష్ట్రాల్లో ప్రధానమంత్రి గరీబ్‌ కళ్యాణ్‌ యోజన అమలుపై దద్దరిల్లిన రాజ్యసభ

PM Garib Kalyan Yojna: తెలుగు రాష్ట్రాల్లో ప్రధానమంత్రి గరీబ్‌ కళ్యాణ్‌ యోజన అమలుపై రాజ్యసభ దద్దరిల్లింది. తెలంగాణ ప్రభుత్వం పేదలకు ఇవ్వాల్సిన బియ్యాన్ని ఏప్రిల్‌ ,..

PM Garib Kalyan Yojna: తెలుగు రాష్ట్రాల్లో ప్రధానమంత్రి గరీబ్‌ కళ్యాణ్‌ యోజన అమలుపై దద్దరిల్లిన రాజ్యసభ
Rajya Sabha

Updated on: Jul 22, 2022 | 9:14 PM

PM Garib Kalyan Yojna: తెలుగు రాష్ట్రాల్లో ప్రధానమంత్రి గరీబ్‌ కళ్యాణ్‌ యోజన అమలుపై రాజ్యసభ దద్దరిల్లింది. తెలంగాణ ప్రభుత్వం పేదలకు ఇవ్వాల్సిన బియ్యాన్ని ఏప్రిల్‌ , మే నెలలో పంపిణీ చేయలేదని మరోసారి విమర్శించారు కేంద్రమంత్రి పీయూష్‌ గోయెల్‌. కేంద్రం ఒత్తిడితో జూన్‌లో అతికష్టం మీద తెలంగాణ ప్రభుత్వం బియ్యాన్ని పంపిణీ చేసిందన్నారు.

ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం కూడా గరీబ్‌ కళ్యాణ్‌ యోజన కింద పేదలకు బియ్యాన్ని పంపిణీ చేయడం లేదని విమర్శించారు బీజేపీ ఎంపీ జీవీఎల్‌ నరసింహారావు. కేంద్రం ఏపీ ప్రభుత్వం మీద ఒత్తిడి తెచ్చి ఈ పథకాన్ని అమలయ్యేలా చూడాలని కోరారు. ఈ విషయంపై ఏపీ ప్రభుత్వంతో మాట్లాడుతామని తెలిపారు పీయూష్‌ గోయెల్‌. ప్రధాని నరేంద్ర మోడీ కోవిడ్‌ సమయంలో ప్రారంభించిన ప్రధాన మంత్రి గరీబ్‌ కళ్యాణ్‌ యోజన కింద పేదలకు కేటాయించిన రేషన్‌ ఇవ్వడంలో విఫలమైందన్నారు. ఈ పథకాన్ని తెలంగాణ సర్కార్‌ ఏప్రిల్‌ నెలలోనే నిలిపివేసిందన్నారు.

కాగా, ఈ ప్రధానమంత్రి గరీబ్‌ కళ్యాణ్‌ యోజన తెలుగు రాష్ట్రాల్లోనే కాకుండా దేశ వ్యాప్తంగా అన్ని రాష్ట్రాల ప్రజలకు ఆసరాగా నిలుస్తోంది. కరోనా మహమ్మారి సమయంలో ప్రజలు తీవ్ర ఇబ్బందులకు గురయ్యారు. చాలా మంది తినేందుకు తిండి లేక పస్తులుండాల్సిన దుస్థితి నెలకొంది. కరోనా ప్రభావంతో లాక్‌డౌన్‌ కారణంగా ఉపాధి లేక ఎంతో మంది రోడ్డున పడ్డారు. అలాంటి పరిస్థితి నుంచి గట్టేక్కేందుకు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఈ పథకాన్ని అమలు చేస్తూ వస్తున్నారు. దేశంలో కరోనా కేసులు తగ్గుముఖం పట్టినా.. ఈ పథకాన్ని ఇంకా కొనసాగిస్తూనే ఉన్నారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి