ప్లేన్ నడిపిన రాజ్ నాథ్ .. థ్రిల్లింగ్ ఫీల్ లో రక్షణ మంత్రి

|

Sep 19, 2019 | 1:12 PM

రక్షణ శాఖ మంత్రి రాజ్ నాథ్ సింగ్ కొద్దిసేపు పైలట్ అయ్యారు. తలకు హెల్మెట్, ఆక్సిజన్ మాస్క్, జీ-సూట్ ధరించిన ఆయన గురువారం బెంగుళూరులోని హెచ్ ఏ ఎల్ విమానాశ్రయంలో తేలికపాటి విమానం ‘ తేజాస్ ‘ ఎక్కారు . పైలట్ తో బాటు సుమారు 30 నిముషాలసేపు ప్లేన్ నడిపారు. మొదట ఎయిర్ వైస్ మార్షల్ ఎన్. తివారీ, ఇతర వైమానికదళ అధికారులు విమానాశ్రయంలో ఆయన వెంట నడిచారు. రాజ్ నాథ్ కొద్దిసేపు ప్లేన్ ను […]

ప్లేన్ నడిపిన రాజ్ నాథ్ .. థ్రిల్లింగ్ ఫీల్ లో రక్షణ మంత్రి
Follow us on

రక్షణ శాఖ మంత్రి రాజ్ నాథ్ సింగ్ కొద్దిసేపు పైలట్ అయ్యారు. తలకు హెల్మెట్, ఆక్సిజన్ మాస్క్, జీ-సూట్ ధరించిన ఆయన గురువారం బెంగుళూరులోని హెచ్ ఏ ఎల్ విమానాశ్రయంలో తేలికపాటి విమానం ‘ తేజాస్ ‘ ఎక్కారు . పైలట్ తో బాటు సుమారు 30 నిముషాలసేపు ప్లేన్ నడిపారు. మొదట ఎయిర్ వైస్ మార్షల్ ఎన్. తివారీ, ఇతర వైమానికదళ అధికారులు విమానాశ్రయంలో ఆయన వెంట నడిచారు. రాజ్ నాథ్ కొద్దిసేపు ప్లేన్ ను కంట్రోల్ చేయగలిగారని డీ ఆర్ డీఓ చీఫ్ జి.సతీష్ రెడ్డి తెలిపారు. ప్లేన్ నడపడం ఎంతో థ్రిల్లింగ్ గా ఉందని రాజ్ నాథ్ ఆ తరువాత తెలిపారు. దేశీయంగా తయారైనందునే తాను తేజాస్ విమానాన్ని ఎంపిక చేసుకున్నట్టు ఆయన చెప్పారు. ఈ విధమైన విమానాలను కొనుగోలు చేసేందుకు ఆగ్నేయాసియా దేశాలు ఎంతో ఆసక్తి చూపుతున్నాయని అయన వెల్లడించారు. తొలుత ఆల్ సెట్ ఫర్ ది డే ‘ అంటూ రెండు ఫొటోలతో కూడిన ట్వీట్ చేశారాయన. గత శుక్రవారమే తేజాస్ విమానం నేవీలో ప్రవేశించింది. గోవాలో మొదటిసారి దిగింది. 68 ఏళ్ళ రక్షణ మంత్రి విమానం నడపడాన్ని ఎయిర్ ఫోర్స్ గర్వకారణంగా భావిస్తోంది.