AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

అంతర్జాతీయ వేదికపై రాజ్ నాథ్ చురకలు

సరిహద్దుల్లో చైనా దుందుడుకు చర్యల వేళ అంతర్జాతీయ వేదికపై భారత రక్షణ మంత్రి రాజ్‌నాథ్‌ సింగ్‌ చురకలంటించారు. మాస్కోలో జరిగిన షాంఘై సహకార సంస్థ (ఎస్‌సీఓ) భేటీలో రాజ్ నాథ్.. చైనా మంత్రి సమక్షంలో కీలక వ్యాఖ్యలు చేశారు.

అంతర్జాతీయ వేదికపై రాజ్ నాథ్ చురకలు
Anil kumar poka
|

Updated on: Sep 04, 2020 | 9:20 PM

Share

సరిహద్దుల్లో చైనా దుందుడుకు చర్యల వేళ అంతర్జాతీయ వేదికపై భారత రక్షణ మంత్రి రాజ్‌నాథ్‌ సింగ్‌ చురకలంటించారు. మాస్కోలో జరిగిన షాంఘై సహకార సంస్థ (ఎస్‌సీఓ) భేటీలో రాజ్ నాథ్.. చైనా మంత్రి సమక్షంలో కీలక వ్యాఖ్యలు చేశారు. విభేదాలను సామరస్యంగా పరిష్కరించుకోవడం, ఒకరి ప్రయోజనాలను మరొకరు గుర్తెరగడం అవసరమని ఎస్‌సీఓ మంత్రుల భేటీలో రాజ్‌నాథ్‌ పేర్కొన్నారు. ఈ సమావేశంలో చైనా రక్షణ మంత్రి జనరల్‌ వీ ఫెంఘే కూడా పాల్గొన్నారు. పరస్పర విశ్వాసం, సంయమనం, సామరస్య పరిష్కారం, అంతర్జాతీయ నిబంధనలను గౌరవించడం ద్వారానే శాంతి సుస్ధిరత నెలకొల్పగలమని రాజ్‌నాథ్‌ సింగ్‌ చెప్పారు. ప్రపంచ జనాభాలో 40 శాతానికి పైగా జనాభా కలిగిన ఎస్‌సీఓ సభ్య దేశాల మధ్య పరస్పర సహకారం, ఇచ్చిపుచ్చుకునే ధోరణి కీలకమని రాజ్ నాథ్ ఈ సందర్భంగా ఉద్ఘాటించారు. భద్రత, రక్షణ వ్యవహారాలపై దృష్టి కేంద్రీకరించే ఎనిమిది దేశాల ఎస్‌సీఓలో భారత్‌, చైనా సభ్య దేశాలుగా ఉన్న సంగతి తెలిసిందే.