Rajinikanth :భారతీయ సినిమాకు గణనీయమైన సేవ చేసిన వారికి ప్రతి సంవత్సరం ఇచ్చే పురస్కారాన్ని 2020 సంవత్సరానికిగాను సూపర్ స్టార్ రజనీకాంత్ కు కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. భారతీయ సినిమాకు పితామహుడుగా భావించబడే దాదాసాహెబ్ ఫాల్కే జన్మ శతి సందర్భంగా 1963లో ఈ పురస్కారం ఏర్పాటు చేయబడింది. ఒక సంవత్సరానికి సంబంధించిన పురస్కారం మరుసటి ఏడాది చివర్లో ఇచ్చే జాతీయ సినిమా అవార్డుల తోపాటు ఇస్తారు. తాజాగా ఈ అవార్డ్ ను రజని కాంత్ అందుకోనున్నారు .
దాదా సాహెబ్ ఫాల్కే అవార్డ్ రజనీకాంత్ కు ఇవ్వాలని జ్యురీ నిర్ణయించింది. కేంద్రం ఆమోదించింది. రజనికాంత్ సినీ పరిశ్రమకు చేసిన సేవలకు గాను దాదాసాహెబ్ ఫాల్కే అవార్డు ను ఇస్తున్నామని కేంద్ర మంత్రి ప్రకాష్ జవడేకర్ ప్రకటించారు.
రజనీకాంత్ ఈ అవార్డు పొందిన 12 వ దక్షిణ భారతీయుడు. డాక్టర్ రాజ్‌కుమార్, అక్కినేని నాగేశ్వర్ రావు, కె బాలచందర్ వంటి దిగ్గజాలు దాదాసాహెబ్ ఫాల్కే అవార్డు ను అందుకున్నారు.
అయితే కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ దక్షిణాది రాష్ట్రాల్లో పాగా వెయ్యాలని భావిస్తుంది. తమిళనాడు అసెంబ్లీ ఎన్నికలపై దృష్టి పెట్టింది. ఈ నేపథ్యంలో తమిళనాడులో భారీ ఫాలోయింగ్ ఉన్న రజనీకాంత్ కు ఇప్పుడు దాదాసాహెచ్ ఫాల్కే అవార్డు ను ప్రకటించడం .. ఎలక్షన్ స్టంట్ అని విపక్షాలు విమర్శలు చేస్తున్నాయి. ఇక మరికొందరు ఇది తమిళనాడుకు కేంద్రం ఎలక్షన్ ఆఫర్ అని.. రజని కాంత్ పార్టీ పెట్టి ఆ నిర్ణయాన్ని వెనక్కి తీసుకున్నందుకు గిఫ్ట్ అని అంటున్నారు. అంతేకాదు.. అసెంబ్లీ ఎన్నికల్లో రజని ఫ్యాన్స్ ఓట్ల కోసం అని మరికొందరు ఘాటుగా విమర్శలు సంధిస్తున్నారు.
రజనీకాంత్ ఓ సాధారణ ఉద్యోగి.. సినీ పరిశ్రమలో అడుగు పెట్టి.. అంచెలంచెలుగా ఎదుగుతూ ఈరోజు దేశంలోనే అత్యంత ప్రజాధారణ కలిగిన నటుడిగా పేరు తెచ్చుకున్నారు . తన విలక్షణ నటనతో దేశ విదేశాల్లో అభిమానులను సొంతం చేసుకున్న రజనీకాంత్ 160 సినిమాలకు పైగా నటించారు.. 2016లో అప్పటి దివంగత రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ నుంచి పద్మవిభూషణ్ పురస్కారం సూపర్ స్టార్ రజినీకాంత్ అందుకున్నారు.
51st Dadasaheb Phalke Award will be conferred upon actor Rajinikanth, says Union Minister Prakash Javadekar. pic.twitter.com/682c6qaUXV
— ANI (@ANI) April 1, 2021
Also Read: మీతో మాట్లాడను మీరు మీ అమ్మనే ఎంచుకున్నారు.. నన్ను కాదన్న కార్తీక్..