
రాజస్థాన్ జైలులో జీవిత ఖైదు అనుభవిస్తున్న ఇద్దరు ఖైదీల వివాహం చర్చనీయాంశమైంది. హనీ ట్రాప్ యువకుడినే ప్రియా సేథ్ వివాహం చేసుకోబోతుంది. హత్య కేసులో జైపూర్ జైలులో జీవిత ఖైదు అనుభవిస్తున్న హంతకురాలు ప్రియా సేథ్, హత్య కేసులో అదే జైలులో జీవిత ఖైదు అనుభవిస్తున్న హనుమాన్ ప్రసాద్‌తో ప్రేమలో పడింది. జనవరి 23న అల్వార్‌లో ఇద్దరూ వివాహం చేసుకోనున్నారు. ఈ వేడుక కోసం రాజస్థాన్ హైకోర్టు వారికి 15 రోజుల పెరోల్ మంజూరు చేసింది.
జైపూర్‌లో జరిగిన అపఖ్యాతి పాలైన దుష్యంత్ శర్మ హత్య కేసులో జైలులో ఉన్న ప్రియా సేథ్ శిక్ష అనుభవిస్తోంది. ప్రియా, హనుమాన్ ఇద్దరూ జైపూర్ ఓపెన్ జైలులో ఉన్నారు. ఓపెన్ జైలులోనే వారు కలుసుకున్నారు. ఇప్పుడు వివాహం చేసుకోబోతున్నారు. న్యాయవాది విశ్రామ్ ప్రజాపత్ కోర్టులో వారి తరపున వాదించారు. హైకోర్టు ఆదేశాన్ని అనుసరించి, జిల్లా పెరోల్ సలహా కమిటీ ప్రియా సేథ్ ప్రతిపాదినను అంగీకరించి ఇద్దరికీ పెరోల్ మంజూరు చేసింది.
తన మాజీ ప్రేమికుడు దీక్షంత్ కమ్రా అప్పు తీర్చడానికి ప్రియా జోత్వారాకు చెందిన దుష్యంత్ శర్మ అనే యువకుడిని ప్రలోభపెట్టింది. ఆ తర్వాత ఆమె దుష్యంత్‌ను తన ఫ్లాట్‌కు ఆహ్వానించింది. అక్కడ ఆమె ప్రియుడు దీక్షంత్, అతని సహచరులు అప్పటికే ఉన్నారు. దుష్యంత్‌ను కిడ్నాప్ చేసి 10 లక్షల రూపాయలు వసూలు చేయాలని పథకం వేశారు, కానీ ఆ పథకం విఫలమైంది. ఇంతలో, ప్రియా, ఆమె సహచరులు 3 లక్షల రూపాయలు బదిలీ చేయగలిగారు. విషయం బయటపడి తాము పట్టుబడతామని భయపడి, ముగ్గురు కలిసి అతన్ని చంపడానికి కుట్ర పన్నారు. అతని గొంతు కోసి చంపారు.
దుష్యంత్ హత్య కేసులో ప్రియాను పోలీసులు అరెస్టు చేశారు. హత్య కేసులో ఆమె జీవిత ఖైదు అనుభవిస్తోంది. ఆమె మే 3, 2018 నుండి జైలులో ఉంది. ఇంతలో, ఆమె వివాహం చేసుకోబోతోందని, హత్యలో పాల్గొన్న తన ప్రియుడు దీక్షాంత్‌ను కాదని, ఆమె కొత్త ప్రియుడు హనుమాన్ ప్రసాద్‌ను వివాహం చేసుకుంటున్నట్లు వార్తలు వెలువడ్డాయి. హనుమాన్ కూడా హత్య కేసులో జీవిత ఖైదు అనుభవిస్తున్నాడు.
జైపూర్‌కు చెందిన ప్రియా సేథ్ రాజస్థాన్‌లో అత్యంత ప్రముఖ మహిళా గ్యాంగ్‌స్టర్‌గా మారాలని కోరుకుంది. ఆమె వ్యభిచారం, మోసం, ATM దోపిడీలు వంటి నేరాలలో పాల్గొంది. ఆమె చదువుకోవడానికి జైపూర్‌కు వచ్చింది. కానీ త్వరలోనే నేరాల మార్గాన్ని ఎంచుకుంది. ఆమె మొదట తన బంధువుల ఇంటిని విడిచిపెట్టి, పేయింగ్ గెస్ట్‌గా జీవించడం ప్రారంభించింది. ఆ తర్వాత ఆమె ధనవంతులైన పురుషులతో స్నేహం చేయడం, విలాసవంతమైన ఖర్చులు చేయడం వంటి ప్రలోభాలలో మునిగిపోయింది. తన కోరికలను తీర్చుకోవడానికి, ఆమె హానీ ట్రాపింగ్‌ను ఆశ్రయించింది. తన అందంతో ధనవంతులైన పురుషులను ఆకర్షించి వారిని దోచుకుంది. ప్రస్తుతం, ప్రియా హత్య ఆరోపణలపై మే 3, 2018 నుండి జైపూర్ జైలులో జీవిత ఖైదు అనుభవిస్తోంది.
మరిన్ని క్రైమ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.