అతనికి 53 ఏళ్లు.. పళ్లు తోముకుంటూ టూత్‌బ్రష్‌ మింగేశాడు

|

Jul 20, 2023 | 9:13 AM

సాధారణంగా పిల్లలు నాణేలు, ఉంగరాలు వంటి చిన్న వస్తువులను మింగుతుంటారు. ఐతే రాజస్థాన్‌లోని ఉదయ్‌పూర్‌లో ఓ వ్యక్తి పళ్లు తోముకుంటూ ఏకంగా 12 సెంటీమీటర్ల టూత్ బ్రష్‌ను మింగేశాడు..

అతనికి 53 ఏళ్లు.. పళ్లు తోముకుంటూ టూత్‌బ్రష్‌ మింగేశాడు
Gopal Singh Rao
Follow us on

ఉదయ్‌పూర్, జులై 20: సాధారణంగా పిల్లలు నాణేలు, ఉంగరాలు వంటి చిన్న వస్తువులను మింగుతుంటారు. ఐతే రాజస్థాన్‌లోని ఉదయ్‌పూర్‌లో ఓ వ్యక్తి పళ్లు తోముకుంటూ ఏకంగా 12 సెంటీమీటర్ల టూత్ బ్రష్‌ను మింగేశాడు.

ఉదయ్‌పూర్‌లోని చిత్తోర్‌కు చెందిన గోపాల్‌సింగ్‌రావు (53) అనే వ్యక్తి పళ్లు తోముకుంటూ ఉండగా టూత్‌బ్రష్‌ గొంతులోకి వెళ్లిపోయింది. తేరుకునేలోపే బ్రష్ మరింత లోతుగా జారి పొట్టలోకి వెళ్లిపోయింది. దీంతో ఊపిరాడక అవస్తపడుతుండటంతో గమనించిన కుటుంబ సభ్యులు హుటాహుటీన సమీపంలోని ఆసుపత్రికి తరలించారు. ఐతే అక్కడి వైద్యులకు టూత్ బ్రష్ తొలగించడం సాధ్యం కాలేదు. దీంతో జీబీహెచ్‌ అమెరికన్ హాస్పిటల్‌కి తరలించారు. సీటీ స్కాన్‌ చేయగా బ్రష్‌ పొత్తికడుపు భాగంలో ఇరుక్కుపోయినట్లు గుర్తించారు. సర్జన్ డాక్టర్ శశాంక్ జె త్రివేది బృందం ఎండోస్కోపిక్ విధానంతో దాన్ని తొలగించాలని నిర్ణయించారు.

దీంతో ఆపరేషన్ లేకుండానే వైద్యులు టూత్ బ్రష్‌ను నోటి ద్వారా బయటికి తీశారు. ఇలాంటి సంఘటనలు చాలా అరుదుగా జరుగుతుంటాయని డాక్టర్ శశాంక్ తెలిపారు. ప్రపంచంలో ఇప్పటివరకు కేవలం యాభై మాత్రమే టూత్ బ్రష్ మింగిన సంఘటనలు జరిగాయన్నారు. ఐతే ఎలాంటి ఆపరేషన్‌ లేకుండా టూత్‌బ్రష్‌ను తొలగించడం రాజస్థాన్‌లో ఇదే తొలిసారని తెలిపారు. రోగిని ఒకరోజు ఐసీయూలో ఉంచి డిశ్చార్జ్ చేశారు. కాగా ఈ కేసు జనరల్ ఆఫ్ సర్జరీలో ప్రచురణ నిమిత్తం ప్రపంచ ఆరోగ్య సంస్థ (WHO) రికార్డుల్లో నమోదు కోసం సంపినట్లు డాక్టర్‌ శశాంక్‌ పేర్కొన్నారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి.